Action Thriller: ఓటీటీలో ప్రతిరోజూ కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిలో కొన్నే ప్రేక్షకుల మనసులో నిలిచిపోతాయి. భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకపోయినా… గ్రిప్పింగ్ స్టోరీ, కట్టిపడేసే ఎమోషన్స్, ఉత్కంఠభరితమైన స్క్రీన్ తో ప్రేక్షకుడిని చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే సినిమాలు అప్పుడప్పుడే కనిపిస్తాయి. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది డెట్ కలెక్టర్’ (The Debt Collector) కూడా అలాంటి హిడెన్ జెమ్‌లలో ఒకటి. స్టార్టింగ్ లో చూస్తే, ఇదొక రొటీన్ యాక్షన్ క్రైమ్ మూవీ అనిపించొచ్చు. కానీ కథ ముందుకు సాగేకొద్దీ నెక్స్ట్ ఏం జరగబోతుందా ? అన్న క్యూరియాసిటీ పెరిగిపోతుంది. తప్పు చేసిన వ్యక్తి నిజంగా మారగలడా ? గత పాపాలకు విముక్తి దొరుకుతుందా ? అనే ప్రశ్నలను మన ముందుంచే ఈ థాయ్ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. మనసును తాకే ప్రయాణం కూడా. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
కథ థాయ్‌లాండ్‌లో నడిచే చట్టవిరుద్ధమైన లోన్ షార్క్ అనే ఫినాన్షియల్ మాఫియా చుట్టూ తిరుగుతుంది. అక్కడ అప్పు తీసుకున్న వాళ్లకు వడ్డీ కంటే భయం ఎక్కువ. ఎందుకంటే డబ్బు వసూలు చేసే వాళ్లకు కనికరం అనే మాటే తెలియదు. అలాంటి క్రూరమైన ప్రపంచంలో ఒకప్పుడు పేరు తెచ్చుకున్న వ్యక్తే నుమ్.
అప్పులు చెల్లించలేని వాళ్లను బెదిరించడం, కొట్టడం, కుటుంబాలనే భయపెట్టడం… అతనికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య. ఆ జీవితం ఎప్పటికీ అలాగే సాగుతుందని అనుకున్న సమయంలో, నేరం చేసి జైలుకు వెళ్లడంతో మార్పు మొదలవుతుంది. జైలు నుంచి బయటకొచ్చిన నుమ్‌కు మరో పెద్ద షాక్ ఎదురవుతుంది. తనకు ప్రాణాంతకమైన వ్యాధి ఉందని, బతికేది చాలా తక్కువ రోజులు మాత్రమేనని తెలుస్తుంది. ఆ క్షణం నుంచి అతని ఆలోచనలు మారిపోతాయి. జీవితంలో సంపాదించిన భయం, డబ్బు, శక్తి అన్నీ వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
గతంలో తాను నాశనం చేసిన మనుషుల జీవితాల గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపంతో కృంగిపోతాడు. తనకు చాలా తక్కువ టైమ్ ఉంది. బతికి ఉన్న ఆ కొన్ని రోజులైనా మంచి పనులు చేయాలని నిర్ణయించుకుంటాడు. అదే నిర్ణయం అతన్ని మరోసారి ఆ క్రూరమైన లోన్ మాఫియా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కానీ ఈసారి అతని చేతిలో అప్పుల జాబితా కాదు… అమాయకులను కాపాడాలనే సంకల్పం ఉంటుంది.
తన పాత శత్రువుల మధ్య అడుగు పెట్టిన నుమ్‌కు ప్రతి క్షణం ప్రమాదమే ఎదురవుతుంది. ఒకవైపు ఘోరమైన గ్యాంగ్‌లు, మరోవైపు తన గతం వెంటాడుతూనే ఉంటుంది. ఎవరి కోసం పోరాడుతున్నాడో వాళ్ల నమ్మకం కూడా అంత ఈజీగా దక్కదు. ఇంతకీ చివరికి ఏమైంది ? అసలు నిజం ఏంటి ? నుమ్ తన గతంలో తాను చేసిన పాపాల నుంచి విముక్తి పొందాడా ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.
‘ది డెట్ కలెక్టర్’ మూవీ 2026లోనే విడుదలైంది. Netflixలో జూలై 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ భాష థాయ్ తో పాటు హిందీ డబ్బింగ్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ ప్రస్తుతం అవైలబుల్ గా లేదు. సినిమాను చూడాలి అనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి. యాక్షన్ తో పాటు ఒక మనిషి చేసిన తప్పులు అతని జీవితాన్ని ఎలా మార్చేస్తాయో చెప్పే హార్ట్ టచింగ్ స్టోరీ ఇది.
Read Also: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చుక్కలు చూపించే లేడీ సింగం… ఒక్కొక్కడికీ చుక్కలే