E-Paper
Advertisement

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్

ఉపాధ్యాయులపై దాడులు… విద్యార్థులకు బుద్ధి చెప్పే ఊర మాస్ టీచర్
Advertisement

Teach you a lesson OTT : NEET పేపర్ లీక్‌తో దేశమంతా ఆగ్రహం, అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో విద్యా వ్యవస్థలోని లొసుగులపై ముక్కుసూటిగా తీసిన ఒక సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో హల్‌చల్ చేస్తోంది. ఈ సిరీస్ పేరు “టీచ్ యు ఎ లెసన్” (Teach You a Lesson). జూన్ 5న విడుదలైన ఈ దక్షిణ కొరియా సిరీస్ రెండు రోజుల్లోనే ‘బెర్లిన్ 2’, ‘ది వండర్‌ఫుల్స్’ వంటి పాపులర్ షోలను అధిగమించి నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో నంబర్ 1 స్థానం దక్కించుకుంది. IMDbలో 8.5 రేటింగ్‌తో భారీ ప్రశంసలు అందుకుంటోంది.

కథలోకి వెళ్తే…

సిరీస్ ప్రధానంగా రెండు వ్యతిరేక బ్యూరోల చుట్టూ తిరుగుతుంది. ఒకటి టీచర్స్ అథారిటీ ప్రొటెక్షన్ బ్యూరో (TAPB) – ఉపాధ్యాయుల హక్కులు, గౌరవం, అధికారాన్ని కాపాడే ప్రత్యేక బృందం. రెండవది ఎడ్యుకేషన్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో (ERPB) – విద్యార్థుల హక్కులను కాపాడే సంస్థ. కానీ ఈ రెండు సంస్థలు తమ అధికారాలను అతిక్రమించి చాలా కఠినంగా పని చేస్తాయి. కథలో ఒక ప్రముఖ కాలేజీలో ఉపాధ్యాయుడిని విద్యార్థులు బహిరంగంగా అవమానించడం, హనీ తలపెట్టడం, తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై దాడి చేయడం వంటి సంఘటనలు జరుగుతాయి. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం TAPBని ఏర్పాటు చేస్తుంది. ఈ బ్యూరోలోని అధికారులు (కిమ్ ము-యెల్ ప్రధాన పాత్ర) విద్యార్థులు, తల్లిదండ్రులను కఠినంగా హెచ్చరించి, శిక్షిస్తారు. వారు ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసిన వారిని నేరుగా ఇన్వెస్టిగేట్ చేసి, రికార్డింగులు, ఆధారాలతో బహిర్గతం చేస్తారు.

Advertisement

అదే సమయంలో ERPB కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇక్కడే కథలో ట్విస్టులు, సస్పెన్స్ పెరుగుతాయి. ఒకవైపు ఉపాధ్యాయుల బాధలు, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు… మరోవైపు విద్యార్థుల మానసిక సమస్యలు, తల్లిదండ్రుల ఆశలు, కోచింగ్ సెంటర్ల వ్యాపార మనస్తత్వం వంటి అంశాలు ఉంటాయి. మరి చివరికి విద్యార్థులను ఎలా క్రమశిక్షణలో పెట్టారు ? ఈ క్రమంలో చోటు చేసుకున్న ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ఏంటి ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.

ఇవే సిరీస్ హైలెట్స్

కిమ్ ము-యెల్ ధైర్యవంతుడైన అధికారి పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. లీ సంగ్-మిన్ ఒక బాధాకరమైన ఉపాధ్యాయుడి పాత్రలో హృదయాన్ని తాకుతాడు. జిన్ కి-జూ ధైర్యవంతురాలైన టీచర్‌ గా, ప్యో జి-హూన్ యువ అధికారి పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హాంగ్ జూంగ్-చాన్ దర్శకత్వం, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ డెప్త్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. ఈ సిరీస్ లో కేవలం విద్యా వ్యవస్థను విమర్శించడం మాత్రమే కాదు… ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య ఉన్న సంబంధాలను, ఒత్తిడిని, అంతర్గత సమస్యలను సమతుల్యంగా చూపించేలా తీశారు. ప్రస్తుతం మన దేశంలో నీట్, పేపర్ లీక్ వంటి విషయాలు చర్చనీయాంశమై ఉన్నందున ఈ సిరీస్ ప్రస్తుత సమయానికి తగ్గట్టుగా ఉంది. ఒక్క ఎపిసోడ్ చూస్తే మధ్యలో ఆపలేరు. యాక్షన్, డ్రామా, సోషల్ మెసేజ్ అన్నీ కలిపి ఉన్న ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Advertisement

Read Also : పురుగు కరిస్తే పుట్టుకొచ్చే సూపర్ హీరో.. ఈ 8 ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ను చూశారా ?

Tags

Related News

థియేటర్లలోనే కాదు ఓటీటీలో దూసుకుపోతున్న సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ!

చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

10 రోజుల్లో పట్టుకోవాలని సీరియల్ కిల్లర్ ఛాలెంజ్… ప్రాసిక్యూటర్ కు మెంటలెక్కించే సైకో

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

Big Stories

Advertisement
×