E-Paper
Advertisement

Sports Drama OTT: ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ ఇచ్చే శిష్యుడు… గురువు అంతకు మించి… టాప్ లేపుతున్న స్పోర్ట్స్ డ్రామా

Sports Drama OTT: ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్ ఇచ్చే శిష్యుడు… గురువు అంతకు మించి… టాప్ లేపుతున్న స్పోర్ట్స్ డ్రామా
Advertisement

Sports Drama OTT : ఒక అద్భుతమైన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే కొరియన్ సినిమాపై ఓ లుక్ వేయండి. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కూడా అయింది. 1980 లో ప్రసిద్ధి చెందిన ‘Baduk’ అనే గేమ్ చుట్టూ కథ ఉంటుంది. రియల్ లైఫ్ ప్లేయర్స్ అయిన చో హున్-హ్యూన్, లీ చాంగ్-హో మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. కొన్ని వివాదాల తరువాత ఈ సినిమా గత ఏడాది థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ కూడా అయింది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో

ఈ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా పేరు ‘ది మ్యాచ్’ (The Match). కిమ్ హ్యుంగ్-జూ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 మార్చి 26న థియేటర్లలో విడుదలైంది. ఇందులో లీ బైంగ్-హున్, యూ అహ్-ఇన్, కో చాంగ్-సియోక్, హ్యూన్ బాంగ్-సిక్, మూన్ జియోంగ్-హీ, కిమ్ కాంగ్-హూన్ నటించారు. ‘స్క్విడ్ గేమ్’ ఫేమ్ లీ బైంగ్-హున్ గురువు పాత్రలో నటించగా, యూ ఆ-ఇన్ శిష్యుడి పాత్రలో నటించారు. వీరిద్దరూ కొరియాలో సూపర్ స్టార్స్ కూడా. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇది 1980ల కాలంలో జరిగే కథ. చో హున్-హ్యూన్ అనే వ్యక్తి ‘గో’ అనే బోర్డ్ గేమ్‌లో తిరుగులేని ఛాంపియన్. ప్రపంచవ్యాప్తంగా అతనికి ఎంతో పేరు ఉంటుంది. ఒకరోజు అతను ఒక చిన్న అబ్బాయిని (లీ చాంగ్-హో) చూస్తాడు. ఆ అబ్బాయికి ఆటలో ఉన్న తెలివితేటలను గమనించి, తన దగ్గరే ఉంచుకుని శిక్షణ ఇస్తాడు. ఇక గురువు దగ్గర అన్ని మెళకువలు నేర్చుకున్న శిష్యుడు చాలా వేగంగా ఎదుగుతాడు. అతను ఎప్పుడూ ప్రశాంతంగా, ఎటువంటి ఎమోషన్స్ చూపించకుండా ఆడతాడు. ఒకానొక దశలో శిష్యుడు ఎంతటి స్థాయికి చేరుకుంటాడంటే, తన గురువునే ఓడించే స్థాయికి వస్తాడు.

అయితే గురువుకు తన శిష్యుడి ఎదుగుదల చూసి గర్వంగా ఉన్నా, తన సామ్రాజ్యం కూలిపోతుందనే భయం, బాధ మొదలవుతాయి. చివరకు ఒక పెద్ద టోర్నమెంట్‌లో గురుశిష్యులు తలపడాల్సి వస్తుంది. ఒకవైపు అనుభవం ఉన్న గురువు, మరోవైపు కొత్త ఎత్తులతో దూసుకుపోయే శిష్యుడు. వీరిద్దరి మధ్య జరిగే ఆ ‘మ్యాచ్’ మరో లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమాలో ఫిజికల్ ఫైట్స్ ఉండవు, కానీ బోర్డు మీద పెట్టే ప్రతి కాయిన్ ఒక యుద్ధంలా ఉంటుంది. చివరగా గురువు తన ఓటమిని ఎలా ఒప్పుకున్నాడు ? శిష్యుడు తన గురువును దాటి ఎలా వెళ్ళాడు? అనే ఎమోషన్స్‌ని దర్శకుడు చాలా బాగా చూపించారు.

Advertisement

Read Also : ముగ్గురు స్నేహితులను ముప్పుతిప్పలు పెట్టే ఆత్మ… ఓటీటీలోకి వస్తున్న మలయాళం సూపర్ హిట్ మూవీ

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×