E-Paper
Advertisement

RainOne App: రైల్ వన్ యాప్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? వావ్, ఇంత సులభమా!

RainOne App: రైల్ వన్ యాప్‌లో రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలా? వావ్, ఇంత సులభమా!
Advertisement

Indian Railway RailOne App: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో RailOne యాప్ ను పరిచయం చేసింది. అంతకు ముందు ఉన్న IRCTC యాప్ స్థానంలో దీనిని తీసుకొచ్చింది. గతంలో ఒక్కో రైల్వే సేవకు ఒక్కో యాప్ ఉపయోగించాల్సి ఉండగా, ఇప్పుడు అన్ని రైల్వే సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొస్తూ ఈ యాప్ ను రూపొందించింది. ఈ యాప్ తో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం చాలా సులభం. ప్రయాణీకులు సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు, తత్కాల్ టిక్కెట్లు, ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను నేరుగా స్మార్ట్‌ ఫోన్ల నుంచి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. RailOne యాప్ IRCTC అకౌంట్ డీటైల్స్ తోనూ పని చేస్తుంది.

RailOne యాప్ గురించి..  

RailOne యాప్ భారతీయ రైల్వే ప్రయాణీకుల కోసం రూపొందించిన అధికారిక మొబైల్ యాప్. ఈ యాప్ తో రైళ్ల వివరాలు, సీట్ల లభ్యత, టికెట్ల బుకింగ్, PNR స్టేటస్ చెకింగ్, టికెట్స్ క్యాన్సిలేషన్, ఫుడ్ ఆర్డర్, కంప్లైంట్స్ సహా అన్ని సర్వీసులు పొందవచ్చు. ఈ యాప్ లోకి లాగిన్ అయేందుకు IRCTC యూజర్ ID, పాస్‌ వర్డ్ ఉంటే సరిపోతుంది. లేని వాళ్లు కొత్తగా సైన్ ఇన్ అయితే సరిపోతుంది.

RailOneలో టికెట్ బుకింగ్ ఎలా?  

Advertisement

ముందుగా RailOne యాప్ లోకి లాగిన్ కావాలి. ప్రయాణీకుల వివరాలను ముందుగానే యాడ్ చేసుకోవాలి. UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చెయ్యొచ్చు. సాధారణ రిజర్వేషన్ టికెట్‌ బుక్ చేసుకోవడానికి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో యాడ్ చేయాలి. ప్రయాణ తేదీని సెలెక్ట్ చేయాలి. మీ ప్రయాణానికి సరిపోయే సమయానికి ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయో చూడాలి. ఆ తర్వాత అందుబాటులో ఉన్న రైళ్లలో ఏ క్లాస్ లో వెళ్లాలో సెలెక్ట్ చేసుకోవాలి. సీటు అవైలబులిటీని చెక్ చేయాలి. ప్రయాణీకుల పేరు, వయస్సు, లింగం, బెర్త్ ప్రాధాన్యతను యాడ్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి. SMS ద్వారా, యాప్‌లో కన్ఫర్మేషన్ లభిస్తుంది.

తత్కాల్ టికెట్‌ బుక్ ఎలా చేసుకోవాలి?

ఎమర్జెన్సీ ప్రయాణీకులకు ఈ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. రైలు ప్రయాణానికి ఒకరోజు ముందు AC క్లాస్ లకు ఉదయం 10:00 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. నాన్ AC క్లాస్ లకు ఉదయం 11:00 గంటలకు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ ఓపెనింగ్ కు 5 నుంచి 10 నిమిషాల ముందు లాగిన్ కావాలి.  ప్రయాణించాల్సిన రైలు కోసం చెక్ చేయాలి. కోటా అనే చోట  తత్కాల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాస్ ను సెలెక్ట్ చేసుకోవాలి.  సేవ్ చేసిన ప్రయాణీకుల వివరాలను త్వరగా ఎంటర్ చేయాలి. వెంటనే చెల్లింపును పూర్తి చేయాలి. తత్కాల్ టిక్కెట్లు నిమిషాల్లోనే అమ్ముడవుతాయి. వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ముఖ్యం. త్వరగా చెల్లింపు కోసం UPIని ఉపయోగించాలి.

Advertisement

ప్రీమియం తత్కాల్ టికెట్లు కూడా ఇంచుమించు ఇలాగే బుక్ చేసుకోవాలి. అయతే, ఛార్జీలు సాధారణ తత్కాల్ ఛార్జీల కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా RailOne యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్‌ను సులభతరం చేస్తుంది. సౌకర్యవంతంగా చేస్తుంది.

Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, అందుబాటులోకి 1,244 స్పెషల్ రైళ్లు!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×