E-Paper
Advertisement

Year Ender 2025 : ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి ‘వీక్ హీరో’ వరకు… ఈ ఏడాది ఓటీటీని ఏలిన కొరియన్ డ్రామాలు ఇవే

Year Ender 2025 : ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి ‘వీక్ హీరో’ వరకు… ఈ ఏడాది ఓటీటీని ఏలిన కొరియన్ డ్రామాలు ఇవే
Advertisement

Year Ender 2025 : ఈ సంవత్సరం కొరియన్ మూవీ లవర్స్ పండగ చేసుకునే వెబ్ సిరీస్ ఓటీటీలలో సందడి చేశాయి. ఆ లిస్ట్ లో ‘స్క్విడ్ గేమ్ సీజన్ 3’, ‘వెన్ లైఫ్ గివ్స్ యు టాన్జేరిన్స్’, చారిత్రక ఫాంటసీ షో ‘బాన్ అపెటిట్, యువర్ మెజెస్టి’ వంటి భారీ హిట్‌లు ఉన్నాయి. 2025లో రొమాన్స్ నుండి ఇంటెన్స్ థ్రిల్లర్‌ల వరకు విభిన్న జానర్లో ఓటీటీలలో దుమ్మురేపిన బెస్ట్ కొరియన్ థ్రిల్లర్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

ది ట్రామా కోడ్ : హీరోస్ ఆన్ కాల్ (The Trauma Code: Heroes on Call) – Netflix

ఈ మెడికల్ సిరీస్ ఒక యుద్ధ అనుభవజ్ఞుడైన వైద్యుడి కథ. అతను ఒక ప్రధాన ట్రామా సెంటర్‌ను స్థాపించడానికి వస్తాడు. అక్కడ తన బృందాన్ని ప్రాణాలను రక్షించే మావెరిక్స్‌గా మార్చడానికి తన లైవ్ స్కిల్డ్ విధానాన్ని ఉపయోగిస్తాడు.

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (Squid Game season 3) – Netflix

Advertisement

ఈ థ్రిల్లర్ సిరీస్ గురించి తెలియని ఓటీటీ మూవీ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ‘సకివ గేమ్’ను చూసి థ్రిల్లయిన ఆడియన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ బ్లడీ డెత్ గేమ్ సీజన్ 3కి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ దక్కింది.

వీక్ హీరో క్లాస్ 2 (Weak Hero Class 2) – Netflix

‘వీక్ హీరో’ సిరీస్ లో రెండవ భాగం ఈ యాక్షన్ సిరీస్. స్కూల్ లో ఓ అబ్బాయిని అందరూ ఏడిపిస్తూ ఉంటారు. అయితే ఆ అబ్బాయి మాత్రం హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి తన తెలివితేటలు, సాధనాలు, మనస్తత్వశాస్త్రాన్ని ఉపయోగిస్తాడు.

వెన్ లైఫ్ గివ్స్ యు టాన్జేరిన్స్ (When Life Gives You Tangerines) – Netflix

Advertisement

జెజు ద్వీపంలో జరిగే ఈ సిరీస్ ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేము. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు. జీవితాంతం ఎదురు దెబ్బలు తిన్న ఓ జంట స్టోరీ ఇది. లైఫ్ పై విరక్తి పుట్టడం లేదా నిరాశలో ఉంటే ఖచ్చితంగా ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఆల్ టైమ్ కొరియన్ బెస్ట్ సిరీస్ లలో ఇది మొదటి వరుసలో ఉంటుంది.

బాన్ అప్పెటిట్, యువర్ మెజెస్టి (Bon Appétit, Your Majesty) – Netflix

ఈ సిరీస్ దక్షిణ కొరియా ఫ్రెంచ్ వంటకాల చెఫ్ కథ. ఆమె తన వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత, గతంలోకి వెళ్ళిపోతుంది. సడన్ గా నిరంకుశుడిగా పేరు తెచ్చుకున్న రాజు లైఫ్ లోకి అడుగు పెడుతుంది. ఆ తరువాత ఏమైంది? అన్నది స్వయంగా చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ట్రూ కొరియన్ సిరీస్ లవర్స్ అయితే పొరపాటున కూడా ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు. Bon Appétit, Your Majesty

టైఫూన్ ఫ్యామిలీ (Typhoon Family) – Netflix

1997లో నడిచే పీరియాడిక్ డ్రామా ఇది. 1997 ఆర్థిక సంక్షోభ సమయంలో తన తండ్రి వదిలి పెట్టిన చిన్న వ్యాపారమైన టైఫూన్ కంపెనీని కాపాడటానికి పోరాడుతున్న ఒక యువ CEO కథ. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.

డియర్ ఎక్స్ (Dear X)

వాన్జుయిన్ రాసిన ‘నేవర్ వెబ్‌టూన్’ ఆధారంగా అదే పేరుతో రూపొందించబడిన ఈ థ్రిల్లర్ సిరీస్, గృహ హింసను భరించి పెరిగిన అగ్ర నటి బేక్ ఎ జిన్ కథ. ఆమె చేసే అవకతవకలు తన పతనానికి ఎలా దారితీస్తాయి అన్నది సిరీస్ ప్రధాన అంశం.

ది మానిప్యులేటెడ్ (The Manipulated) – JioHotstar

ఈ థ్రిల్లర్ షో అంతా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసుకున్న వ్యక్తి గురించి. తాను చేయని నేరానికి జైలు పాలైన తర్వాత, తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులను నాశనం చేయడానికి అతను ఏం చేశాడన్నది స్టోరీ.

Read Also : ఓటీటీలో మూవీ చూసిన జనాలు హీరోకి టికెట్ డబ్బులు పంపిన ఒకే ఒక్క మూవీ ఇదే

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×