E-Paper
Advertisement

Google Pixel Price cut: గూగుల్ పిక్సెల్ ఫ్లాగ్‌షిప్ పై రూ.10000 తగ్గింపు.. బెస్ట్ డీల్ ఎక్కడంటే

Google Pixel Price cut: గూగుల్ పిక్సెల్ ఫ్లాగ్‌షిప్ పై రూ.10000 తగ్గింపు.. బెస్ట్ డీల్ ఎక్కడంటే
Advertisement

Google Pixel Price cut| రూ.40 వేల బడ్జెట్‌లో మంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందుకే మిడ్ రేంజ్ లో ప్రీమియం కొనాలని చూసే వాళ్లు ఈ డీల్‌ని గమనించాలి. విజయ్ సేల్స్‌లో గూగుల్ పిక్సెల్ 9a భారీ డిస్కౌంట్‌తో దొరుకుతోంది. సూపర్ కెమెరా, ప్రీమియం గూగుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కొత్త ప్రైస్ లాంచ్ ధర కంటే దాదాపు రూ.10,000 తక్కువ. ప్రైస్ కట్ తో పాటు బ్యాంక్ ఆఫర్లు కలిపి ఈ లిమిటెడ్ టైమ్ డీల్ వచ్చింది.

పిక్సెల్ 9a ధర, బ్యాంక్ ఆఫర్లు

పిక్సెల్ 9a మార్చి 2025లో రూ.49,999కి లాంచ్ అయింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు విజయ్ సేల్స్‌లో రూ.44,999కి లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫ్లాట్ రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఆఫర్ అప్లై చేస్తే ఫైనల్ ధర రూ.39,999 అవుతుంది. అంటే లాంచ్ ధర కంటే రూ.10,000 తక్కువ. పిక్సెల్ ఫ్యాన్స్‌కి బెస్ట్ వాల్యూ. లిమిటెడ్ స్టాక్ ఉన్నంతవరకే ఆఫర్.

డిస్‌ప్లే, డిజైన్ ఎలా ఉంది?

Advertisement

పిక్సెల్ 9aలో 6.3 అంగుళాల Actua pOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1080 x 2424 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇవ్వడంతో స్క్రీన్ స్మూత్‌గా ఉంటుంది. పీక్ బ్రైట్‌నెస్ 2700 నిట్స్. ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ప్రీమియం, కాంపాక్ట్ డిజైన్ ఉండడంతో ఒక చేత్తో సులువుగా వాడొచ్చు. బిల్డ్ క్వాలిటీ సాలిడ్, రిఫైన్డ్‌గా ఉంటుంది.

పర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

ఫోన్‌లో Tensor G4 చిప్‌సెట్ ఉంది. రోజువారీ టాస్క్‌లు బాగా హ్యాండిల్ చేస్తుంది. మల్టీటాస్కింగ్, బ్రౌజింగ్, గేమింగ్ స్మూత్‌గా జరుగుతాయి. ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. క్లీన్ ఇంటర్‌ఫేస్, అనవసర యాప్స్ లేవు. లాంగ్ టర్మ్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ దొరుకుతాయి. 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి.

కెమెరా పర్ఫామెన్స్ ఎలా ఉంది?

Advertisement

కెమెరా పర్ఫామెన్స్‌కి ఫేమస్. 48MP ప్రైమరీ రియర్ (వెనుకభాగంలో) కెమెరా.. OIS సపోర్ట్ ఉంది. f/1.7 అపర్చర్ లెన్స్ లో లైట్‌లో డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. 13MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కి బాగుంది. గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్రతి ఫోటోని మెరుగుపరుస్తుంది.

Also Read: వాట్సాప్‌ స్టేటస్‌, చానల్‌లో యాడ్స్ వస్తున్నాయా? తొలగించాలంటే ఇలా చేయండి

కనెక్టివిటీ, ఇతర ఫీచర్స్

5G, 4G LTE సపోర్ట్ ఉంది. Wi-Fi 6E ఫాస్ట్ వైర్‌లెస్ కనెక్టివిటీ ఇస్తుంది. Bluetooth 5.3, NFC డిజిటల్ పేమెంట్స్‌కి ఉపయోగం. GPS, NavIC నావిగేషన్ బాగుంటుంది. USB Type-C 3.2 పోర్ట్ ఉంది. హైట్ 154.7mm, విడ్త్ 73.3mm, వెయిట్ 185.9 గ్రామ్స్.

పిక్సెల్ 9a ఇప్పుడు కొనడం కరెక్టేనా

ఈ డిస్కౌంట్‌తో పిక్సెల్ 9a మళ్లీ ప్రీమియం ఫోన్ ‌లలో స్ట్రాంగ్ ఆప్షన్‌గా మారింది. క్లీన్ సాఫ్ట్‌వేర్, రిలయబుల్ కెమెరా కావాలనేవాళ్లకి బెస్ట్. ధర తగ్గడంతో వాల్యూ చాలా పెరిగింది. ఫోటోగ్రఫీ లవర్స్, ప్యూర్ ఆండ్రాయిడ్ యూజర్లకి సూపర్. స్టాక్ ఉన్నంత వరకు ఈ డీల్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. రూ.39,999 ధరకు గూగుల్ పిక్సెల్ 9a లభించడం ఒక అద్భుతమైన డీల్. మిస్ చేసుకోవద్దు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×