E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీసులు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

Year Ender 2025 : 2025లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీసులు… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?
Advertisement

Year Ender 2025 : ఈ ఏడాది ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ థ్రిల్లర్లతో మూవీ లవర్స్ పండగ చేసుకున్నారు. అయితే 2025లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లు ఏంటో తెలుసా? ఇయర్ ఎండ్ సందర్భంగా ఆ విషయాన్ని తెలుసుకుందాం పదండి.

మండల మర్డర్స్ (Mandala Murders)

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో ఒక రహస్య కల్ట్ సంస్థ మర్డర్స్ కు పాల్పడుతుంది. భయంకరమైన సీరియల్ కిల్లర్‌ ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులకు ఎదురైన సైకలాజికల్ గేమ్స్ ఏంటి? మిస్టీరియస్ చిహ్నాలు ఏంటి? అన్నది సిరీస్. వాణి కపూర్ నటించిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

పాతాళ్ లోక్ సీజన్ 2 (paatal lok season 2)

Advertisement

జైదీప్ అహ్లవత్, ఇష్వాక్ సింగ్ నటించిన ఈ ఉత్కంఠభరితమైన క్రైమ్-థ్రిల్లర్ కొత్త సీజన్‌ కథ ఢిల్లీ నుండి నాగాలాండ్‌కు మారింది. ఈ సంవత్సరం ప్రేక్షకులు బాగా ఆదరించిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. నేరం, అవినీతి రాజకీయాలు వంటి అంశాలను ఇందులో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.

ఖౌఫ్ (Khauf)

వింత సంఘటనలతో నిండిన పట్టణం చుట్టూ తిరిగే హర్రర్-థ్రిల్లర్ ఇది. ఈ సిరీస్‌లో మోనికా పన్వర్, రజత్ కపూర్ మరియు చుమ్ దరాంగ్ కీలక పాత్రల్లో నటించారు. “ఖౌఫ్” ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.

స్పెషల్ ఆప్స్ సీజన్ 2 (Special Ops Season 2)

Advertisement

హిమ్మత్ సింగ్ ప్రపంచ ఉగ్రవాద ముప్పులను పరిశోధించడానికి, రహస్య నెట్‌వర్క్‌లను వెలికితీయడానికి ఒక కొత్త బృందంతో తిరిగి వస్తాడు. క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉండే ఈ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (khakee the bengal chapter)

బెంగాల్ నేర ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిన సిరీస్ ఇది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన “ఖాకీ – ది బెంగాల్ చాప్టర్” అనే ఈ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 (The Family Man Season 3)

శ్రీకాంత్ తివారీ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ ఈ ఏడాది మిస్ అవ్వకుండా చూడాల్సిన సిరీస్ లలో ఒకటి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది.

పంకజ్ త్రిపాఠి నటించిన ‘క్రిమినల్ జస్టిస్ : ఎ ఫ్యామిలీ మ్యాటర్’ (Criminal Justice: A Family Matter), సోనీ లివ్‌లో ప్రసాఅవుతున్న ‘అందేఖి’, “కంఖజుర”, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న “ఢిల్లీ క్రైమ్ సీజన్ 3” కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన సిరీస్ లే. డోంట్ మిస్.

Read Also : నెట్ ఫ్లిక్స్ లో తుక్కురేగ్గొడుతున్న 2 గంటల 28 నిమిషాల పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్… IMDbలో అదిరిపోయే రేటింగ్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×