E-Paper
Advertisement

Hyderabad News: సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ.. సంస్కరణలు, ఆ చట్టంపై చర్చ

Hyderabad News: సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ.. సంస్కరణలు, ఆ చట్టంపై చర్చ
Advertisement

Hyderabad News: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ప్రశంసించారు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన, సీఎం రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇరువురు మధ్య ఆ చట్టం గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది.  ఇంతకీ ఆ చట్టం ఏంటి?

సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్‌ భేటీ

Advertisement

గురువారం హైదరాబాద్ వచ్చారు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. బోర్డు సమావేశంలో పాల్గొన్న ఆయన, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ఆర్‌బీఐ గవర్నర్‌కు వివరించారు ముఖ్యమంత్రి.

దీనికితోడు విద్యుత్తు సెక్టార్‌తో తెచ్చిన సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు, అలాగే సోలార్‌ విద్యుత్తు వినియోగం పెంచే దిశగా తీసుకున్న చర్యలు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, కొత్త సంస్కరణలు , ప్రగతిశీల విధానాలను తీసుకురావాలని కోరారు.

Advertisement

ప్రభుత్వ సంస్కరణలు.. ఆ చట్టంపై చర్చ

ఇదే సమయంలో తెలంగాణలో BUDS (Banning of Unregulated Deposit Schemes) యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్-ULI విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవ.. ప్రభుత్వ- ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ తదితర అంశాలను వివరించారు.

బడ్స్ BUDS చట్టం-2019 అంటే ఏంటి? క్రమబద్ధీకరించని డిపాజిట్ పథకాల నిషేధ చట్టం అది. మోసపూరిత పోంజీ స్కీమ్‌ల వంటి అక్రమ డిపాజిట్ పథకాలను నిషేధించడం దీని ఉద్దేశం. ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం, మోసం చేసేవారిపై కఠినశిక్షలు విధించడం కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం.

ALSO READ: చలి పంజా ఎఫెక్ట్.. స్కూళ్ల టైమింగ్స్ మార్పు, ఆ టైమ్ కి పాఠశాలలు ఓపెన్

ఈ చట్టం ద్వారా చట్టవిరుద్ధమైన పథకాలను ప్రోత్సహించడం, నిర్వహించడం అనేది నేరం. భారీ జరిమానాలతోపాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాదు మోసగాళ్ల ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు రక్షణ కల్పిస్తుంది. అక్రమ డిపాజిట్ స్కీమ్‌లకు సంబంధించిన నేరాలపై దర్యాప్తు చేయడానికి పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED లకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

నెట్‌వర్క్ మార్కెటింగ్-MLM, పోంజీ పథకాల పేరుతో జరిగే మోసాల వల్ల సామాన్య ప్రజలకు జరిగే నష్టం కాపాడటం అందులోని ప్రధాన లక్ష్యం. కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చినప్పటికీ, మరికొన్ని రాష్ట్రాలు ఇంకా అమలు చేయలేదు. దీని కారణంగా అధికార పరిధిలో మోసపూరిత పథకాలు పని చేయడానికి అనుమతించే లొసుగులు ఏర్పడతాయి.

చట్టాన్ని తెలియజేయడం డిపాజిటర్లను రక్షించడంలో సహాయపడుతుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఆర్‌బీఐ హైదరాబాద్‌ రీజనల్‌ డైరెక్టర్‌ చిన్మోయ్‌కుమార్‌‌లు పాల్గొన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×