Year Ender 2025 : 2025 ఓటీటీ మూవీ లవర్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. యాక్షన్ నుంచి థ్రిల్లర్ వరకు ఓటీటీలోకి వచ్చిన సినిమాలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఓటీటీలో సీక్వెల్స్ హవా బాగా నడిచింది. అలాగే మహిళా నటీమణుల ప్రతిభ కనిపించింది. ‘మహారాణి సీజన్ 4’, ‘ఢిల్లీ క్రైమ్ 3’ వంటి థ్రిల్లర్ సిరీస్‌లకు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. కాజోల్, హుమా ఖురేషి, షెఫాలీ షా వంటి లేడీ సింగమ్స్ అదరగొట్టారు. మరి 2025లో వచ్చిన బెస్ట్ సీక్వెల్స్ ఏంటో చూసేద్దాం పదండి.
జైదీప్ అహ్లవత్ నటించిన “పాతాళ్ లోక్ సీజన్ 2” విడుదలైన వెంటనే సంచలనంగా మారింది. ఈ డార్క్ అండ్ ఉత్కంఠభరితమైన సిరీస్‌లో జైదీప్ అహ్లవత్ ఇన్‌స్పెక్టర్ హాథీరామ్ పాత్రను అద్భుతంగా పోషించి, తన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. ఈ సిరీస్ రాజకీయ అవినీతి, సమాజంపై దాని ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఈ సిరీస్ జనవరి 17న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
“రానా నాయుడు సీజన్ 2” జూన్ 13న ఓటీటీ ప్రపంచంలోకి తిరిగి వచ్చింది. సీజన్ 2లో యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ ను సంపూర్ణంగా మిళితం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, దీనికి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇందులో దగ్గుబాటి వెంకటేష్, రానా మెయిన్ లీడ్స్ అన్న విషయం తెలిసిందే.
కాజోల్ నటించిన లీగల్ డ్రామా సిరీస్ “ట్రయల్ 2” కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చర్చకు దారితీసింది. కాజోల్ మరోసారి అద్భుతమైన నటనను ప్రదర్శించగా, కుబ్రా సైట్ కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 19న జియోసినిమాలో విడుదలైంది.
నవంబర్ 21న విడుదలైన “ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3” లేకుండా ఈ లిస్ట్ అసంపూర్ణం. ఈ సంవత్సరం మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీగా ఈ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కలగలిపి ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
“ఢిల్లీ క్రైమ్ సీజన్ 3” ఈ సంవత్సరం అత్యుత్తమ సిరీస్‌లలో ఒకటి ఎందుకంటే ఇందులో మహిళలను హీరోలుగా, విలన్‌లుగా చూపించారు. హుమా ఖురేషి మానవ అక్రమ రవాణాదారురాలు అయిన దీదీగా నటించగా, షెఫాలీ షా పోలీసు అధికారిగా నటించారు. ఈ సిరీస్ నవంబర్ 13న SonyLIVలో విడుదలైంది.
‘మహారాణి సీజన్ 4’లో హుమా ఖురేషి ఐకానిక్ పాత్ర రాణి భారతి 2025లో కూడా సూపర్ హిట్ అన్పించుకుంది. నవంబర్ 24న SonyLIVలో ప్రీమియర్ అయిన ఈ పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ సిరీస్ అభిమానుల మనసును గెలుచుకుంది.
Read Also : ఈ వీకెండ్‌కు ఇంట్లోనే అచ్చ తెలుగు ఎంటర్టైన్మెంట్… ఓటీటీలో 5 కొత్త సినిమాలు సిరీసులు