Bigg Boss 9 Telugu : తెలుగు ఆడియన్స్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం 9వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎపిసోడ్ తో ఈ సీజన్ కి ముగింపు పలకపోతున్నారు. గత కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ షోకు శుభం కార్డు పడబోతుంది. దీంతో ఎవరు విన్నర్ గా నిలుస్తారో అన్నది గత వారం నుంచి సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో కొనసాగుతున్నారు.. వీరిలోంచి ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో ఇమ్మానుయేల్ బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.. తక్కువ ఓటింగ్ కారణంగా ఇమ్మూ ఎలిమినేట్ అయ్యినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి 15 వారాలకు గాను ఇమ్మూ ఎన్ని లక్షలు సంపాదించాడో ఒకసారి తెలుసుకుందాం…
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ఒక్క రోజులో ముగియబోతుంది. కానీ ఇప్పుడు అంతా విన్నర్ గురించే మాట్లాడుకుంటున్నారు.. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్లలో ఉన్న వారిలోంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది జనాల్లో వెతుకుతున్న ప్రశ్న. అదే డబల్ ఎలిమినేషన్ జరిగితే చివరికి ముగ్గురు మాత్రమే హౌస్ లో నిలుస్తారు.. మరి ఈ ముగ్గురిలో ఎవరు విన్నర్గా నిలుస్తారు? రన్నర్ గా ఎంత ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.. అయితే టాప్ ఫైవ్ లో తన కామెడీతో ఆకట్టుకున్న ఇమ్మానుయేల్ నిన్న ఎలిమినేట్ అయ్యారు.. తక్కువ ఓటింగ్ కారణంగా ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈయనకు అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి 15 వారాలకు ఆయన ఎంత తీసుకున్నారంటే.. రోజుకి రూ.35వేలు తీసుకుంటున్నాడట. ఇలా వారానికి రూ.2.25లక్షలు అని సమాచారం. ఈ లెక్కన ఇమ్మాన్యుయెల్‌కి భారీ పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. ఆయన 15 వారాలకుగానూ ఏకంగా రూ.3375000 వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. విన్నర్ ప్రైజ్ మనీకి దగ్గరగాని సంపాదించాడు ఇమ్మూ..
Also Read :బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే..?
బిగ్ బాస్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కాస్త కష్టమే. మొదటినుంచి ఇమ్మానుయేల్ టాప్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్నాడు.. కానీ చివరికి వచ్చేలోగా అతను విన్నర్ గా కానీ రన్నర్ గా కానీ నిలుస్తారని అందరూ అనుకున్నారు. తక్కువ ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చేసాడు. ఇక సంజన కూడా అతి తక్కువ ఓటింగ్ తో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఈమె గురించి ఇవాళ తెలిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న డిమాన్ కళ్యాణ్, తనుజాలలో ఎవరు విన్నారుగా నిలుస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.. ఇవాళ ఫైనల్ ఎపిసోడ్ జరగబోతున్న నేపథ్యంలో ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా విన్నర్ ఎవరనేది తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఫైనల్ ఎపిసోడ్ కి మాస్ హీరో రవితేజ గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కొన్ని గంటల్లో దీనిపై ఒక క్లారిటీ రానుంది..