E-Paper
Advertisement

Maruti Mini Bus: అత్యంత చౌకగా మారుతి మినీ బస్, ఇదీ అసలు సంగతి!

Maruti Mini Bus: అత్యంత చౌకగా మారుతి మినీ బస్, ఇదీ అసలు సంగతి!
Advertisement

Maruti New Mini Bus: ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి సుజుకి 2026కు గాను పలు కొత్త మోడల్స్ ను పరిచయం చేయబోతోంది. కార్లతో పాటు ఓ కొత్త మినీ బస్సును కూడా తీసుకురాబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిని ఈకో 2025 పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా కథనాలు ఈ మినీ బస్సు గురించి ఏం చెప్తున్నాయంటే..

మారుతి ఈకో (Eeco) 2025 ధర, వివరాలు

మారుతి ఈకో ఇండియాలో అతి సరసమైన మల్టీ పర్పస్ వెహికల్ (MPV/వ్యాన్) గా గుర్తింపు తెచ్చుకోనుంది. దీన్ని చాలామంది మినీ వ్యాన్, చిన్న ప్యాసింజర్ క్యారియర్‌ గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. స్కూల్ వ్యాన్, టూర్, కార్గో కోసం వాడుకోవచ్చు. ఈ మినీ బస్సుకు సంబంధించిన ధరను పరిశీలిస్తే..  ఎక్స్ షోరూమ్ ధర  రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.95 లక్షల వరకు వేరియంట్‌ పై ఆధారపడి ఉంటుంది. బేస్ మోడల్ 5 సీటర్ పెట్రోల్ వెర్షన్ సుమారు రూ. 5.32 లక్షలుగా ఉంటుంది. CNG వేరియంట్స్, AC ఉన్నవి ఎక్కువ ధర ఉంటుంది. ఆన్ రోడ్ ధర ఆయా నగరాల మీద ఆధారపడి రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఉంటుంది.

మారుతి ఈకో (Eeco) 2025  స్పెసిఫికేషన్స్

Advertisement

ఇంజన్ గురించి చూస్తే.. ఇది1.2L K సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ అడ్వాన్స్‌డ్ వెర్షన్ తో రానుంది. 80 PS పవర్, 104 Nm టార్క్, CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ 20-26 kmpl వరకు ఇస్తుంది. CNG వెర్షన్ 26-30 km/kg వరకు ఇస్తుంది. వైరల్ న్యూస్ లో చెప్పినట్లు 28-35 kmpl రాకపోవచ్చు అంటున్నారు. సీటింగ్ కెపాసిటీ గురించి పరిశీలిస్తే, 5-సీటర్, 7-సీటర్ తో పాటు కార్గో వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.

మారుతి ఈకో (Eeco) 2025 ఫీచర్స్

ఈ మినీ బస్సులో డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, ABS with EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. మాన్యువల్ AC, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిక్లైనింగ్ సీట్స్ తో వస్తుంది. స్పేషియస్ క్యాబిన్, హై రూఫ్ ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు, స్కూల్స్, స్మాల్ బిజినెస్‌కు ఐడియల్ గా ఉంటుంది. EMI ఆప్షన్స్  విషయానికి వస్తే, సుమారు రూ. 6,000- 8,000 నుంచి ప్రారంభం అవుతుంది.

మినీ బస్ లాంచ్ గురించి ప్రకటించని కంపెనీ

Advertisement

రూ.4.99 లక్షలతో కొత్త మినీ బస్సును మారుతి ఈకోనే రీబ్రాండ్ చేసినట్టు ప్రచారం మాత్రమే జరుగుతుంది. అధికారికంగా మారుతి సుజుకి నుంచి దీని గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంకా లాంచ్ కాలేదు. కొన్ని రూమర్స్ 2025 చివరలో లేదంటే 2026లో రావచ్చని చెబుతున్నాయి. ధర సుమారు రూ. 8-11 లక్షల స్థాయిలో ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను కంపెనీ అధికారిక వెబ్ సైట్ చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్ సేఫెస్ట్ కార్లు ఇవే.. టాప్‌లో ఉన్నది ఏ కారంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×