E-Paper
Advertisement

Year Ender 2025 : 2025లో ఓటీటీలో దుమ్మురేపిన బెస్ట్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?

Year Ender 2025 : 2025లో ఓటీటీలో దుమ్మురేపిన బెస్ట్ సిరీస్ లు… ఇందులో మీరెన్ని చూశారు?
Advertisement

Year Ender 2025 : 2025 సంవత్సరం వినోదంతో నిండిపోయింది. ఈ సంవత్సరం అనేక అద్భుతమైన భారతీయ వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. ఇయర్ ఎండ్ సందర్భంగా IMDb టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ సిరీస్ ల లిస్ట్ ను వెల్లడించింది.

క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్

పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ గా నటించిన Criminal Justice: A Family Matter ఈ లిస్ట్ లో 10వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ మే 29న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయింది. ఈ షో చివరి ఎపిసోడ్ జూలై 6న ప్రసారం అయింది. ఈ సిరీస్ IMDbలో 7.7 రేటింగ్ ను సాధించింది.

ది ఫ్యామిలీ మ్యాన్

Advertisement

మనోజ్ బాజ్‌పేయి సిరీస్ The Family Man Season 3 ఇందులో 9 వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం విడుదలైన ఈ సిరీస్ మూడవ సీజన్ భారీ సంఖ్యలో వ్యూస్ కొల్లగొట్టింది. ప్రైమ్ వీడియోలో మూడు సీజన్‌లను చూడవచ్చు. ఈ సిరీస్ కు ఐఎండీబీలో రేటింగ్ 8.7 ఉంది.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్

ఈ జాబితాలో 8వ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ Khakee: The Bengal Chapter ఉంది. ఇది మార్చి 20న ప్రీమియర్ అయింది. 7.5 రేటింగ్ తో ఓటీటీలో దూసుకెళ్తోంది.

స్పెషల్ ఆప్స్

Advertisement

Special Ops Season 2 లిస్ట్ లో 7వ స్థానంలో ఉంది. ఈ సిరీస్ కు సంబంధించిన సీజన్ 2 జూలై 18న ప్రీమియర్ అయింది. ఐఎండీబీలో 8.6 రేటింగ్ తో అదరగొట్టిన ఈ సిరీస్ ను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

ఖౌఫ్

ఆరవ స్థానంలో హర్రర్ సిరీస్ Khauf ఉంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18న విడుదలైంది. బిగ్ బాస్ 18లో కనిపించిన చమ్ ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించాడు. 7.4. రేటింగ్ తో ఉన్న ఈ సిరీస్ ను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

మండలా మర్డర్స్

జాబితాలో 5వ స్థానంలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మండలా మర్డర్స్ (Mandala Murders) ఉంది. ఈ సిరీస్ జూలై 25న విడుదలైంది. వాణి కపూర్, వైభవ్ రాజ్ నటించిన ఈ సిరీస్ 6.5.రేటింగ్ తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

పంచాయత్

నాల్గవ సిరీస్ Panchayat Season 4. నాల్గవ సీజన్ ఈ సంవత్సరమే విడుదలైంది. ప్రైమ్ వీడియోలో నాలుగు సీజన్లను చూడవచ్చు. దీనికి ఐఎండీబీలో రేటింగ్ 9 ఉంది.

పాతాల్ లోక్

జైదీప్ అహ్లవత్ సిరీస్ Paatal Lok Season 2 జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ సిరీస్ రెండవ సీజన్ ఇదే ఏడాది విడుదలైంది. ప్రైమ్ వీడియోలో రెండు సీజన్లను చూడవచ్చు. ఈ సిరీస్ రేటింగ్ 8.2.

బ్లాక్ వారెంట్

రెండవ స్థానంలో Black Warrant సిరీస్ ఉంది. ఈ సిరీస్ జనవరి 10న విడుదలైంది. దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్

జాబితాలో మొదటిది ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ The Ba***ds of Bollywood. సెప్టెంబర్ 18న విడుదలైన ఈ సిరీస్ ప్రశంసలను అందుకుంది. ఈ సిరీస్ ఐఎండీబీ రేటింగ్ 7.6. అలాగే ఈ ఏడాది వచ్చిన Delhi Crime Season 3, Dabba Cartel సిరీస్ లు కూడా మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

Read Also : తండ్రి దుర్మార్గం అన్న అరాచకం… అందమైన అమ్మాయికి నరకం… మస్త్ షేడ్స్ ఉన్న స్టోరీ

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×