Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ తనూజ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. ఇమ్మానుయేల్, దివ్యలతో గొడవ, భరణితో బాండింగ్, కళ్యాణ్ తో లవ్ ట్రాక్… ఇలా నిత్యం ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది తనూజ. ఎప్పటికప్పుడు మేము ఫ్రెండ్స్ అని తనూజ చెప్పినప్పటికీ, హౌస్ లో వాళ్ళ చేష్టలు, హౌస్ మేట్స్ వేసే సెటైర్లు వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అన్పించేలా చేస్తున్నాయి. తాజాగా ఇమ్మూ జ్యోతిష్యం నెపంతో ఇన్ డైరెక్ట్ గా కళ్యాణ్ – తనూజ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 9 డే 101 వ ఎపిసోడ్ లో ఇమ్మూ జ్యోతిష్యుడి మారిన సంగతి తెలిసిందే. డెమోన్, సంజన జాతకం చెప్పాక తనూజ వంతు వచ్చింది. ఆమె రాగానే చెయ్యి పట్టుకుని “అందాల రాక్షసి. చెయ్యి అంటే ఇట్టా ఉండాలి. నీ భవిష్యత్తు నీ ముందే ఉంది. కానీ నువ్వే దేఖట్లేదు. కానీ దేకు కొంచం. ఇవన్నీ ఎంత చేస్తావో అంత ప్రేమ చూపిస్తావు” అంటూ కాసేపు కామెడీ చేశాడు. “ఇదంతా ఇమ్మానుయేల్ గురించి. ఇప్పుడు నాకు కాబోయే వాడి గురించి చెప్పు” అని అడిగింది తనూజ. “చిట్టి గుండె మీదే ఉంది ప్రాణం అంతా. కాఫీతో పాటు కాఫీ షాప్ లో వాడన్నా ఇష్టం. ఇది కళ్యాణ రేఖ. నీకు కాబోయే హస్బెండ్ కు సిక్స్ ప్యాక్ ఉండదు, అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు. కానీ మంచి గుండె ఉంటుంది. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు. 10 మందిలో ఉంటే ఎప్పుడో ఒకసారే మాట్లాడతాడు” అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్మూ. ఇక ఇమ్మూ ఇదంతా చెబుతున్నప్పుడు బిగ్ బాస్ కళ్యాణ్ ఫేస్ ను ప్రత్యేకంగా ఫోకస్ చేయడం చూస్తే వీళ్ళ లవ్ ట్రాక్ నిజమేనా అనే అనుమానం రాక మానదు అభిమానులకు. మొదట్లో ఇమ్మూ ఫన్నీగా తన గురించే చెప్పినప్పటికీ కళ్యాణ రేఖ, కామ్ అండ్ కంపోజ్డ్ అనేవి మాత్రం కళ్యాణ్ కే కనెక్ట్ అవుతున్నాయి. ఈ సీజన్ మొత్తంలో కామ్ అండ్ కంపోజ్డ్ అన్నది కళ్యాణ్ ఒక్కడినే.
ఇదంతా ఒక ఎత్తైతే గతంలో చేయి వేసినప్పుడు చిరాకు పడినందుకు ఇటీవలే తనూజ సారీ చెప్పింది. అంతేకాదు మొన్నటికి మొన్న కళ్యాణ్ ప్రపోజ్ చేసిన రేంజ్ లో తనూజ గురించి చెప్పుకొచ్చాడు. ‘మీ దృష్టిలో బిగ్ బాస్ అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబితే… కళ్యాణ్ మాత్రం “ఈ పర్సన్ తో బాండ్ బయటకు వెళ్ళాక కూడా ఉంటది. ఇది ఫ్రెండ్షిప్ కాదు ఈ పర్సన్ నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ” అని ఓపెన్ గా చెప్పేశాడు. మరి బయటకు వెళ్ళాక వీళ్ళ బాండ్ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also : ఈ కట్టె కాలే వరకు ఎంటర్టైన్ చేస్తా… ఇమ్మూ ఎమోషనల్ కామెంట్స్… తనూజాకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలు ఇవేనట