E-Paper
Advertisement

OTT Movie : పప్పీని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇన్ని పాట్లా? 4 స్టోరీలు ఒకే మూవీలో ఉన్న మలయాళ థ్రిల్లర్

OTT Movie : పప్పీని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇన్ని పాట్లా? 4 స్టోరీలు ఒకే మూవీలో ఉన్న మలయాళ థ్రిల్లర్
Advertisement

OTT Movie : మలయాళం ఫ్యాన్స్ ను ఓ సరికొత్త ఆంథాలజీ సినిమా ఓటీటీలో ఎంటర్టైన్ చేయబోతోంది. మరికొద్ది గంటల్లో ఈ సిరీస్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ చిత్రం భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలోని కొంతమంది వ్యక్తుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. నాలుగు కథలుగా వస్తున్న ఈ సినిమా ఒక్కో కథలో ఒక్కో ఎమోషన్ తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఫ్యామిలీతో కలసి ఎంచక్కా దీనిని చూసి ఎంజాయ్ చేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘షేడ్స్ ఆఫ్ లైఫ్’ (Shades of Life) అనే ఈ మలయాళీ ఆంథాలజీ సినిమాకి, రషీద్ అహమ్మద్, జంషీర్ ముహమ్మద్, నటరాజన్ పట్టాంబి
దర్శకులుగా పని చేశారు. ఈ సినిమా 2025 నవంబర్ 21 నుండి Manorama MAX ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇందులో నియాస్ బ్యాకర్, భాస్కర్ అరవింద్, శ్రీజ దాస్, కార్తీక్, దాసన్ కొంగడ్, రమణి మాన్‌ చెరి లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ ఆంథాలజీ సినిమా నాలుగు వేర్వేరు కథల చుట్టూ తిరుగుతుంది. మొదటి కథలో మధ్యపానం వల్ల భార్యతో సంబంధాలు దెబ్బతిన్న ఒక వ్యక్తి, తన అలవాటును మానుకోవడానికి. కుటుంబాన్ని తిరిగి పొందడానికి ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తాడు. తన జీవితాన్ని బాగుచేసుకోవాలనే అతని ప్రయత్నం చలా మందికి ఇన్స్పైర్ గా ఉంటుంది. రెండవ కథలో తీవ్రమైన పేదరికంలో ఉన్న ఒక వలస కూలీ, తన చిన్నారి కుమార్తెకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్లని ఎలాగైనా కొనివ్వాలని తపన పడతాడు. కేవలం కొన్ని రూపాయలు సంపాదించడం కోసం అతను పడే ఆరాటం హృదయాన్ని కదిలిస్తుంది.

Read Also : కలల దేవుడికి కబురు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కోసం అక్కాతమ్ముళ్ల అడ్వెంచర్… కొత్త యానిమేషన్ ఫాంటసీ మూవీ

Advertisement

మూడవ కథలో తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న డబ్బును ఒక దొంగ దొంగిలించినప్పుడు, ఆ తండ్రి ఆ దొంగను పట్టుకోవడానికి పడే ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం దొంగతనం గురించి కాదు, ఒక తండ్రి తన కూతురు భవిష్యత్తు కోసం పడే ఆవేదనను తెలియజేస్తుంది. ఇక చివరి కథలో స్టోరీ ఒక పెళ్ళయిన ఒక కొత్త జంట చుట్టూ తిరుగుతుంది. ఇలా ఈ కథలన్నీ మానవ సంబంధాలను దగ్గరగా చూపిస్తాయి. ఒక్కో స్టోరీలో ఒక్కో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది.

 

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×