E-Paper
Advertisement

OTT Movie : దశాబ్ధాలు దాటినా కొలిక్కిరాని కేసు… సీరియల్ కిల్లర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… మైండ్ ను మడత పెట్టే స్టోరీ

OTT Movie : దశాబ్ధాలు దాటినా కొలిక్కిరాని కేసు… సీరియల్ కిల్లర్ కేసులో అదిరిపోయే ట్విస్టులు… మైండ్ ను మడత పెట్టే స్టోరీ
Advertisement

OTT Movie : రియల్ క్రైమ్ స్టోరీల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఇప్పటివరకు సాల్వ్ కాని సీరియల్ కిల్లర్ కేసు ఆధారంగా తెరకెక్కింది.1960 నాటి కాలంలో కాలిఫోర్నియాలో జోడియాక్ అనే కిల్లర్ కొన్ని జంటలను కాల్చి చంపాడు. పత్రికలకు లెటర్స్ రాసి, కోడ్‌లు కూడా పంపి నన్ను ఎవరూ పట్టుకోలేరని భయపెట్టాడు. ఈ కేసు ఒక కార్టూనిస్ట్, ఒక రిపోర్టర్, ఒక పోలీస్ ఆఫీసర్ జీవితాల్ని పూర్తిగా మార్చేసింది.160 నిమిషాలు కూర్చున్నా, ఒక్క సెకను కూడా కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది ఈ మిస్టరీ థ్రిల్లర్. ఈ కేసు యునైటెడ్ స్టేట్స్ లోనే పరిష్కారం కాకుండా, అపఖ్యాతి పాలైన నేరాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

డేవిడ్ ఫించర్ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం పేరు ‘జోడియాక్’. ఇందులో జేక్ గిల్లెన్‌హాల్, మార్క్ రుఫెలో మరియు రాబర్ట్ డౌనీ జూనియర్ నటించారు. ఐయండిబి లో 7.6/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1960 కాలం నాటి కాలిఫోర్నియాలో జోడియాక్ అనే సైకో ఒంటరిగా ఉన్నజంటల్ని కారులో కాల్చి చంపి, పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి నేనే చంపానని ఫోన్లు కూడా చేస్తుంటాడు. పత్రికలకి లెటర్స్ కూడా రాస్తాడు. ఇప్పటివరకు 37 మందిని చంపానని, నన్ను పట్టుకోలేరని సీక్రెట్ కోడ్‌లు కూడా పంపి పోలీసుల్ని సవాలు చేస్తాడు. సాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ పేపర్‌లో కార్టూనిస్ట్ రాబర్ట్ గ్రేస్మిత్ ఆ లెటర్స్ చూసి పూర్తిగా పిచ్చి పట్టినట్టు ఆబ్సెస్డ్ అయిపోతాడు. ఎలాగైనా కిల్లర్ ని పట్టుకోవాలి అనుకుంటాడు. రిపోర్టర్ పాల్, పోలీస్ ఇన్స్పెక్టర్ టోస్చీ కూడా ఈ కేసు వెంటపడతారు. వీళ్ళు ముగ్గురూ కోడ్‌లు బ్రేక్ చేస్తారు, సస్పెక్ట్స్‌ని ఛేజ్ చేస్తారు. కానీ ఎవరూ 100% కన్ఫర్మ్ కాదు.

Read Also : ప్రేమకథలో మతిపోగొట్టే ట్విస్ట్ … రిజిస్టర్ మ్యారేజ్‌లో దొంగ సంతకం… కట్ చేస్తే ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్ట్

Advertisement

ఇలా 20 ఏళ్లు గడిచిపోతాయి. పాల్ ఆల్కహాల్ అడిక్ట్ తో చచ్చిపోతాడు. టోస్చీ మానసికంగా వీక్ అవుతాడు. గ్రేస్మిత్ ఒక్కడే మిగులుతాడు. అతన్ని కూడా భార్య పిల్లలు వదిలేసి వెళ్లిపోతారు. అతని ఉద్యోగం కూడా పోతుందు. చివరికి అలెన్ అనే వ్యక్తి మీద 99.9% కన్ఫర్మ్ అవుతాడు గ్రేస్మిత్. షూ సైజ్, హ్యాండ్‌రైటింగ్ అన్నీ మ్యాచ్ అవుతాయి. కానీ ప్రూఫ్ లేదు. కేసు ఓపెన్‌గానే ఉంటుంది. ఇప్పటికీ సాల్వ్ కాని కేసులా మిగిలిపోయింది. అంతమందిని చంపిన కిల్లర్ మాత్రం తాపీగా బయట తిరిగేశాడు.

 

 

 

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×