E-Paper
Advertisement

Zombie Movie OTT: యంగ్ అవ్వడానికి మెడిసిన్ తీసుకుంటే జాంబీలుగా మారే ట్విస్ట్… ఒక్కో సీన్ కు వణుకే

Zombie Movie OTT: యంగ్ అవ్వడానికి మెడిసిన్ తీసుకుంటే జాంబీలుగా మారే ట్విస్ట్… ఒక్కో సీన్ కు వణుకే
Advertisement

Zombie Movie OTT : జోంబీ సినిమాలను కేజీగా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలను ఏ భాషలో వచ్చినా వదిలిపెట్టడంలేదు. ఇక ఈ సినిమాలలో హారర్ సీన్స్ కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియా జోంబీ హారర్ మాత్రం ఆడియన్స్ చేత అరుపులు పెట్టిస్తుంది. మరి ఈ సినిమాను చూసి థ్రిల్ అవ్వాలనుకుంటే ఇప్పుడే ఓ లుక్ వేయండి. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఈ ఇండోనేషియా జోంబీ హారర్ చిత్రం పేరు ‘ది ఎలిక్సిర్’ (The Elixir). దీని అసలు పేరు (Abadi Nan Jaya). 2025లో విడుదలైన ఈ సినిమాకి కిమో స్టాంబోయెల్ దర్శకత్వం వహించి, నిర్మించి, సహ రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రంలో మిఖా తంబాయోంగ్, ఎవా సెలియా, డోనీ డమారా, మార్థినో లియో వంటి నటులు లీడ్ రోల్స్ లో నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్ లో 2025 అక్టోబర్ 23 నుంచి అందుబాటులో ఉంది. Netflixలో రిలీజ్ అయిన తర్వాత గ్లోబల్ టాప్ 10లోకి వచ్చింది ఈ 1 గంట 56 నిమిషాల హారర్ సినిమా.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇండోనేషియాలో ఒక సంపన్న కుటుంబం ఆయుర్వేద మూలికా వైద్య సంస్థను నాడుపుతుంటుంది. అయితే ఆ కుటుంబ యజమాని వృద్ధాప్యాన్ని జయించి, నిత్యం యవ్వనంగా ఉంచే ఒక అద్భుతమైన ఎలిక్సిర్ అనే ఔషధాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తాడు. అయితే సరైన ప్రయోగాలు లేకుండా తయారు చేసిన ఆ ఔషధం వికటిస్తుంది. ఆ మందు సేవించిన వాళ్ళు మనుషులుగా కాకుండా, రక్తపిపాసులైన జాంబీలుగా మారిపోతారు. చూస్తుండగానే ఆ గ్రామం మొత్తం భయంకరమైన మారణహోమంలోకి వెళ్తుంది.

ఈ విపత్తు తలెత్తినప్పుడు, ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ వైరస్ నుండి తమను తాము రక్షించుకుంటూ, ఆ గ్రామం నుండి బయటపడటానికి వాళ్ళు చేసే పోరాటమే ఈ సినిమాలోని మిగతా కథ. దర్శకుడు కిమో స్టాంబోయల్ అత్యంత భయంకరమైన హర్రర్ సన్నివేశాలతో ఈ సినిమాని అద్భుతంగా చూపించారు. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది.

Advertisement

Read Also : 2000 ఎత్తున్న టవర్ పై ఇద్దరే అమ్మాయిలు… ఒక్కో టర్న్ కి గుండె జారిపోద్ది… నెక్స్ట్ ఏం జరుగుతుందన్న టెన్షన్ కే పోతారు భయ్యా

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×