E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, స్పాట్‌లో 25 మంది

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, స్పాట్‌లో 25 మంది
Advertisement

Road Accident:  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడారం జాతరకు భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఘటన సమయంలో స్పాట్‌లో 25 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు ఘటన ప్రాంతంలో మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

భూపాలపల్లి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం

Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహాముత్తారం మండలం కాటారం-మేడారం ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. ఘటన సమయంలో 25 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు దుర్మరణం చెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేటకు చెందినవారు.

మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్‌లో 25 మంది కలిసి మేడారం జాతరకు మంగళవారం సాయంత్రం బయలు దేరారు. పెగడపల్లి-కేశవాపూర్ అటవీ ప్రాంతంలో ట్రాక్టరు రహదారి కిందకు దించి మళ్లీ ఎక్కించే క్రమంలో అదుపు తప్పింది. కిందకు పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీ కింద తల్లీ కూతుళ్లు ఉండిపోయారు. వారిద్దరు స్పాట్‌లో మృతి చెందారు.

Advertisement

మేడారం జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా

మరో మహిళ ట్రాక్టర్ లోపల ఇరుక్కుపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ట్రాలీ కింద ఇరుక్కుపోయిన ఆ మహిళను స్థానికుల సాయంతో బయటకు తీశారు. ఘటనట ప్రాంతం నుంచి భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఘటనాస్థలికి ఏఎస్పీ చేరుకొని ప్రమాదాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంతో మేడారానికి వెళ్లేదారిలో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాటారం మీదుగా వచ్చే వాహనాలను భూపాలపల్లి-కమలాపూర్ క్రాస్ నుంచి మళ్లించారు. మృతులు ఇద్దరు ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందినవారు. తల్లి లక్ష్మి వయస్సు 45 ఏళ్లు ఉండగా, ఆమె కూతురు కస్తూరి అక్షిత వయస్సు 21 ఏళ్లు.  గాయపడిన బాధితులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు.. ఖైరతాబాద్‌లో కలకలం

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×