Actress Anjali Latest Photos: అందం, అభినయం కలిగిన అందాల తారా.. అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినా తమిళంలో మూవీస్ చేసి మంచి పేరు సంపాదించుకుంది.
“ఫోటో” సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తర్వాత ప్రేమ లేఖ రాశా, షాపింగ్ మాల్ సినిమాలో అలరించింది.
2011లో జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
2013లో వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇది కూడా సూపర్ హిట్ అందుకుంది.
రవితేజ మూవీ బలుపు, సరైనోడు, నిశ్సబ్ధం, వకీల్ సాబ్ తదితర సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ చేసింది.
ఆ తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గేమ్ ఛేంజర్, మదగ మహారాజు వంటి పలు సినిమాల్లో అలరించింది.
ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికి తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్‌తో పంచుకుంటుంది. అయితే ఇటీవల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. అప్పటికీ ఇప్పటికీ అదే క్రేజ్ తో ప్రేక్షకులను అలరించింది.
తాజాగా ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ.. Thanking each one of you for celebrating seetha and seethammavakitlosirimallechettu అంటూ కాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ భామ.