BigTV English

Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ సీరియస్.. ఎవడ్రా మీకు చెప్పిందంటూ ?

Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ సీరియస్.. ఎవడ్రా మీకు చెప్పిందంటూ ?

Shubman Gill: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగానే నేడు దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ – భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ రూమర్స్ పట్ల భారత క్రికెట్ అభిమానులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. అయితే తాజాగా ఈ రూమర్స్ పై టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ శుబ్ మన్ గిల్ స్పందించారు.


 

శనివారం రోజు దుబాయిలో జరిగిన మీడియా సమావేశంలో గిల్ మాట్లాడుతూ.. ” ప్రస్తుతం జట్టు దృష్టి కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం పైనే ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి ఇప్పటిదాకా డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి చర్చ జరగలేదు. మేము ఈ ఫైనల్ మ్యాచ్లో ఎలా గెలవాలి, ఏం చేయాలి అనే అంశాలపైనే డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించాం. రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్ గురించి జట్టుతో కానీ, నాతో కానీ ఇప్పటివరకు మాట్లాడలేదు.


రోహిత్ శర్మ దృష్టి ఇప్పుడు పూర్తిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గెలవడం గురించి ఆలోచిస్తున్నాడు. నేను జట్టులో ఉత్తమ బ్యాటింగ్ లైనప్ లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. రోహిత్ శర్మ ప్రపంచంలోనే ఉత్తమ ఒపెనర్. ఇక విరాట్ నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేమంతా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. గతంలో మేము వన్డే వరల్డ్ కప్ గెలుచుకోలేకపోయాం.

కానీ ఈసారి అలా జరగనివ్వం” అని చెప్పుకొచ్చాడు గిల్. ఇక ఈ కీలక మ్యాచ్లో నూజిలాండ్ జట్టుని ఎదుర్కోవడానికి రోహిత్ శర్మ అనుభవం, నాయకత్వం చాలా ముఖ్యం. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటివరకు ఓడిపోలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో పటిష్టంగా ఉంది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ 2000 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కీ సీక్వెల్ లా ఉండబోతోంది.

2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినందుకు భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ జట్టు గ్రూప్ దశలో భారత్ పై ఓటమిని చవిచూసింది.

 

ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రానించి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక భారత జట్టు విజయాన్ని అడ్డుకునే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో ఉన్నారనేది వాస్తవం. రచిన్ రవీంద్ర ఫామ్ ని పరిశీలిస్తే.. అతడు మిడిల్ ఆర్డర్లో భారత్ ని వెంటాడే అవకాశం ఉన్న ఆటగాళ్లలో ఒకడు. ఇక బౌలింగ్ విషయంలో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 10 ఓవర్ల స్పీడ్ మాయాజాలం న్యూజిలాండ్ జట్టుకు ప్లస్ కావచ్చు.

Tags

Related News

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Big Stories

×