BigTV English

Ishwarya Menon: ఎలా ఉండేది.. ఇలా అయిపోయింది.. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ ఏంటో..?

Ishwarya Menon: ఎలా ఉండేది.. ఇలా అయిపోయింది.. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ ఏంటో..?

Ishwarya Menon:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ లో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వారు ఎలా అయితే కనిపిస్తారో.. కొన్నేళ్ల తర్వాత అందుకు పూర్తి భిన్నంగా మారిపోతారని చెప్పవచ్చు. ఇప్పటికే నయనతార (Nayanthara), సమంత (Samantha) లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారో చూస్తే ఆ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ బ్యూటీ ఐశ్వర్య మీనన్(Ishwarya Menon) కూడా చేరిపోయారు. 2012లో ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె ఎలా ఉంది..? ఇప్పుడు ఆమె ఎలా ఉంది..? అనే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం ఇంతలోనే అంత మార్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 2012 అంటే దాదాపు 13 సంవత్సరాల లోనే చాలా మారిపోయిందని ఐశ్వర్య మీనన్ ట్రాన్స్ఫర్మేషన్ పై పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఇంత అందంగా మారడానికి సర్జరీలు ఏమైనా చేయించుకుందా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.


ఐశ్వర్య మీనన్ కెరియర్..

ఐశ్వర్య మీనన్ విషయానికి వస్తే.. 1995 మే 8వ తేదీన తమిళనాడు ఈరోడ్ లో జన్మించింది. ఇక ఈమె కుటుంబం కేరళలోని చందమంగళం నుండి వచ్చింది. ఎస్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఐశ్వర్య మీనన్. ఇక తర్వాత తమిళ సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఎమ్మెస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఈమె జోగి ఫేమ్ ప్రేమ్ సరసన కూడా నటించింది. ఇక 2013 అక్టోబర్ 11న విడుదలైన ఈ సినిమాలో మానసిక వికలాంగ బాలికగా ఈమె నటనకు మంచి గుర్తింపు లభించింది.


సినిమాలే కాదు సీరియల్ కూడా..

తండ్రేల్ అనే సీరియల్ లో శృతి క్యారెక్టర్ లో నటించింది. ఇక ఈమె నటించిన తెలుగు చిత్రాల విషయానికి వస్తే.. 2012లో వచ్చిన లవ్ ఫెయిల్యూర్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య మీనన్, ఆ తర్వాత 2022లో ఖిలాడి సినిమాలో నటించి ఆకట్టుకుంది. దాదాపు 10 ఏళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉన్నాయి. ఆ తర్వాత స్పై చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమా ఒప్పుకోలేదు ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం మలయాళంలో బాజూకా అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉన్నట్లు సమాచారం. ఐశ్వర్య మీనన్ సినిమాలు, టీవీ సీరియల్స్ మాత్రమే కాదు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. 2022లో వచ్చిన తెలుగు, తమిళ్ ద్విభాష చిత్రం తమిళ్ రాకర్స్ లో నటించి ఆకట్టుకుంది. మొత్తానికైతే ఇప్పుడు ఈమెలో ఉన్న మార్పు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×