Adhvaria Silks: హైదరాబాద్‌లో ఆధ్వరియా సిల్క్స్ డిజైనర్ దీప్తి రెడ్డి తీర్చిదిద్దిన కామాక్షి కలెక్షన్స్‌తో మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది.
కామాక్షి కలెక్షన్స్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆధ్వరియా సిల్క్స్ ఆధ్వర్యంలో సాగిన ఈ ఫ్యాషన్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఫ్యాషన్ షో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో డిజైనర్ దీప్తి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
ఆధ్వరియా సిల్క్స్ బ్రాండ్ పేరుతో “కామాక్షి కలెక్షన్స్” ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని దీప్తి రెడ్డి తెలిపారు.
కామాక్షి కలెక్షన్ వంశపారంపర్యమైన కంజీవరం చీరలను కలిగి ఉంటుందని తెలిపారు.
ప్రతి వస్త్రం క్లిష్టమైన రూపకల్పన, విలాసవంతమైన కళాఖండం, పాతకాలపు రంగుల ప్యాలెట్ల నుండి ప్రేరణ పొందిందని కామాక్షి కలెక్షన్స్ గురించి వివరించారు.
మన తెలుగు సంప్రదాయం, చక్కదనంతో క్లాసిక్‌గా కనిపించేలా కామాక్షి కలెక్షన్స్ రూపుదిద్దుకున్నాయని అన్నారు దీప్తి రెడ్డి.
పెళ్లికి, ఎంగేజ్మెంట్‌కి మాత్రమే కాకుండా ప్రతి పంక్షన్‌కి తెలుగుదనం ఉట్టిపడేలా ఈ కామాక్షి కలెక్షన్స్ తీర్చిదిద్దాం అని తెలిపారు.
వింటేజ్ లుక్‌తో తయారైన కామాక్షి కలెక్షన్స్ పెద్దవారికి మాత్రమే కాదు.. యూత్‌ను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.
ట్రెడీషిన్‌తో పాటు లగ్జరీ కలవడం అనేది చాలా అరుదైన కాంబినేషన్. కామాక్షి కలెక్షన్స్‌లో ఈ రెండు ఉట్టిపడుతున్నాయి.