TGSRTC Super Offer: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. చక్కటి ఆఫర్లను అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రకరకాల క్రేజీ ఆఫర్లను తీసుకొస్తున్నారు. ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ప్రజలతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సామాజిక అంశాల గురించి స్పందిస్తుంటారు. వాటితో పాటు ఆర్టీసీ ఆఫర్ల గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రజలను ఆర్టీసీలో ప్రయాణించేలా చేస్తున్నారు. తాజాగా ఓ చక్కటి ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. తక్కువ ధరకే మెట్రో డీలక్స్ పాస్ ను అందిస్తోంది. ఇంతకీ ఆ పాస్ ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణిం చేందుకు తక్కువ ధరలో మంత్లీ పాస్ తీసుకొచ్చింది తెలంగాణ ఆర్టీసీ. ఈ పాస్ ను కేవలం రూ. 1450 కే అందిస్తున్నారు. ఈ పాస్ తీసుకున్న వాళ్లు నెలంతా అన్ లిమిటెడ్ గా ప్రయాణం చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిధిలో ఉంటూ రోజూ బస్సు ప్రయాణం చేసే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ పాస్ తీసుకున్న వాళ్లు ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంటే, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్, ఆర్టిరీ బస్సుల్లోనూ వెళ్లవచ్చు. అంటే ఈ పాస్ తీసుకోవడం వల్ల రోజుకు రూ. 48 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు అవుతుంది. ఈ పాస్ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు అంటున్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
Read Also: అబ్బరపరుస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఇదే!
జిల్లా, ఇంటర్ స్టేట్ బస్సుల్లోనూ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్
అటు ఈ మెట్రో డీలక్స్ బస్ పాస్ ఉన్న వాళ్లకు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక రాయితీ ఉంటుంది. జిల్లాల్లో ప్రయాణం చేసే సమయంలో ప్రతి టికెట్ మీద 10 శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ స్టేట్ బస్సుల్లోనూ 10 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ 10 శాతం డిస్కౌంట్ అనేది జిల్లాతో పాటు, ఇంటర్ స్టేట్ ఏసీ బస్సుల్లోనూ ఉంటుందన్నారు. అంటే, ఈ పాస్ ఉన్నవాళ్లు తెలంగాణ ఆర్టీసీ నడిపించే ఏ బస్సులోనైనా ఎక్కడ నుంచి, ఎక్కడికి వెళ్లినా 10 శాతం రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు ఎంతగానో ఉపయోగపడే ఈ పాస్ ను తీసుకోవాలని సూచిస్తోంది. హైదరాబాద్ లో ఉండే వాళ్లకు ఈ పాస్ ప్రయాణ ఖర్చులను విపరీతంగా తగ్గించే అవకాశం ఉందంటున్నారు సజ్జనార్. సో, ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఈ బస్ పాస్ ను తీసుకోండి, హ్యాపీగా డబ్బులు ఆదా చేసుకోండి!
Read Also: ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్, ఆ బస్సుల్లో టికెట్ ధరలపై భారీగా డిస్కౌంట్!