Aditi Shankar Latest Photos: హీరోయిన్స్ అంటే ఫిట్‌గా ఉండాలి, జీరో సైజ్ మెయింటేయిన్ చేయాలి అనే ఆలోచనను చాలామంది ముద్దుగుమ్మలు మార్చేస్తున్నారు. ఆ లిస్ట్‌లోకి అదితి శంకర్ కూడా యాడ్ అయ్యింది. (Image Source: Aditi Shankar/Instagram)
కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు శంకర్. ఆయన వారసురాలు అయిన అదితి.. హీరోయిన్‌గా డెబ్యూ ఇచ్చింది. (Image Source: Aditi Shankar/Instagram)
శంకర్‌కు ఇష్టం లేకపోయినా తానే పట్టుపట్టి హీరోయిన్‌గా మారింది అదితి. అందుకే తన టాలెంట్‌తోనే తానేంటో నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. (Image Source: Aditi Shankar/Instagram)
2022లో కార్తి హీరోగా నటించిన ‘విరుమాన్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అదితి శంకర్. (Image Source: Aditi Shankar/Instagram)
అదితి శంకర్ డెబ్యూ మూవీ యావరేజ్‌గా నిలిచింది. అది తెలుగులో డబ్ అయినా ఇక్కడ డిశాస్టర్ అయ్యింది. (Image Source: Aditi Shankar/Instagram)
డెబ్యూ మూవీ ఫ్లాప్ అయినా కూడా అదితి శంకర్‌కు హీరోయిన్‌గా ఆఫర్లు బాగానే వచ్చాయి. (Image Source: Aditi Shankar/Instagram)
2023లో శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘మావీరన్’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది అదితి శంకర్. (Image Source: Aditi Shankar/Instagram)
2024 మొత్తం అసలు అదితి శంకర్ తెరపై కనిపించలేదు. కానీ 2025లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో అందరినీ అలరించడానికి సిద్ధమయ్యింది. (Image Source: Aditi Shankar/Instagram)
ప్రస్తుతం అదితి శంకర్ హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం ‘నెసిప్పయ’ రిలీజ్ అవుతుండగా దాని ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. (Image Source: Aditi Shankar/Instagram)
అదితి తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే తను కాస్త బొద్దుగా అయ్యిందని, అయినా బాగానే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Source: Aditi Shankar/Instagram)