Chahal wife with iyer: క్రికెటర్లు కేవలం వారి ఆటతోనే కాదు వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో క్రికెటర్ల భార్యలను, గర్ల్ ఫ్రెండ్ లను ఫాలో అవుతారు. వారి వ్యక్తి గల జీవితాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఏ క్రికెటర్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు..? ఏ క్రికెటర్ ఎవరితో ఎఫైర్ నడిపిస్తున్నాడు..? ఏ క్రికెటర్ లవ్ బ్రేకప్ అయ్యింది..? ఏ క్రికెటర్ విడాకులు తీసుకున్నాడు..? ఇలా అనేక వార్తలపై అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తారు.
Also Read: Kohli new bat: విరాట్ కోహ్లీ కొత్త బ్యాట్.. ఇక ఔట్ చేయడం సాధ్యం కాదట!
ఈ నేపథ్యంలోనే భారత స్పిన్ బౌలర్ యుజువెంద్ర చాహల్ – అతని భార్య ధనశ్రీ వర్మ విడాకుల విషయంపై అభిమానులు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ ధనశ్రీ ఫోటోలని తన అకౌంట్ నుంచి తొలగించడంతో వీరి విడాకుల రూమర్ కి మరింత బలం చేకూరింది.
గతంలో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ తో కలిసి ధనశ్రీ వర్మ పలు పార్టీలకు హాజరవ్వడం చర్చనీయంశమైన విషయం తెలిసిందే. అయితే అయ్యార్ తో ధనశ్రీ వర్మ సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తుందని అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇక ప్రస్తుతం వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. కొందరు ఆకతాయిలు అయ్యర్ – ధనశ్రీ వర్మ ఫోటోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( ఏఐ ) ద్వారా నకిలీ ఫోటోలను సృష్టించి వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ ఫోటోలు నకిలీ అని తెలిసినప్పటికీ వీరి విడాకుల రూమర్ నేపథ్యంలో కొంతమంది ఈ ఫోటోలని షేర్ చేసి.. అయ్యర్ ని పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. చాహల్ – ధనశ్రీ వర్మ వారి విడాకుల అంశంపై త్వరగా స్పందించాలని.. ఇలాంటి నకిలీ ఫోటోలను సృష్టించే వారిపైన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఏఐ టెక్నాలజీ సెలబ్రిటీలకు మాత్రం శాపంగా మారిందని చెప్పవచ్చు.
అయితే భార్యల ద్వారా మోసపోయిన క్రికెటర్లు కూడా ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు క్రికెటర్ల భార్యలు విడాకులు తీసుకుని తమ భర్త స్నేహితుడిని పెళ్లి చేసుకున్నారు. వీరిలో మరో భారత ప్లేయర్ దినేష్ కార్తీక్, ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ఉన్నారు.
Also Read: Jasprit Bumrah: SENA దేశాలపై చరిత్ర సృష్టించిన బుమ్రా..ఆసీయాలోనే తొలి ప్లేయర్ గా !
దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికిత ని 2007లో వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగిన ఐదు సంవత్సరాలు సంవత్సరాల తర్వాత ఆమె దినేష్ కార్తీక్ ని మోసం చేసి 2012లో మరో టీమిండియా బ్యాట్స్మెన్ మురళి విజయ్ ని వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా తన భార్య చేతిలో మోసపోయాడు. ఆమె బ్రెట్ లీ ని మోసం చేసి క్రికెటర్ ని కాకుండా రబ్బి ప్లేయర్ ని వివాహం చేసుకుంది.