E-Paper
Advertisement

Job Mela: రేపే జాబ్ మేళా.. మిస్ అవ్వొద్దు..

Job Mela: రేపే జాబ్ మేళా.. మిస్ అవ్వొద్దు..
Advertisement
Job Mela:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు మంచి అవకాశం. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాసై ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  మంచి వేతనంతో కూడిన ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉన్నందున ఈ జాబ్ మేళాకు హాజరవ్వండి.

కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో రేపు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. హాల్‌ మార్క్‌ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీలో జూనియర్‌ అకౌంటెంట్‌, అకౌంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలకు బీకాం, ఎంకామ్, ఎంబీఏ, సీఏ, ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారందరూ ఈ జాబ్ మేళాకు హాజరు కావొచ్చు.
టాలీ, అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో అవగాహన ఉన్న అభ్యర్థులు కూడా జాబ్ మేళాకు హాజరు అవ్వొచ్చు. వరుణ్‌ మోటార్స్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్లు, ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు, హోండా కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.

విద్యార్హత:  పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు.

Advertisement

వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,800 నుంచి రూ.18 వేల వరకూ జీతం ఉంటుంది.

Also Read: Railway Jobs: శుభవార్త.. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 4232 ఉద్యోగాలు..

Advertisement

ఉద్యోగాన్ని బట్టి ఇన్సెంటివ్‌, భోజన, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయని వివరించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తమ కార్యాలయానికి విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. వివరాలకు 77993 76111 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

 

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×