IRCTC TN Temples Tour: భారతదేశంలో ప్రతి రాష్ట్రానికీ తన సొంత చరిత్ర, సంస్కృతి, దేవాలయాల వైభవం ఉంటుంది. కానీ వాటిలో తమిళనాడు అనే రాష్ట్రం మాత్రం ఆధ్యాత్మికత, శిల్పకళ, భక్తి భావం కలగలిపిన ఒక అద్భుతమైన భూమి. ఈ ఆలయాలు కేవలం దేవాలయాలు మాత్రమే కాదు, చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు, మన సంస్కృతికి అద్దం పట్టే రత్నాలు. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ సంస్థ ఈ పవిత్ర స్థలాలను దర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం అందిస్తోంది. మరి టూర్ ప్యాకేజ్ వివరాలు తెలుసుకుందాం.
త్రిచీ – శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం
ఈ యాత్రలో తొలి గమ్యం త్రిచీ. ఇక్కడ ఉన్న శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విష్ణు ఆలయం. ఏడు ప్రాకారాలు, ఎత్తైన గోపురాలు, శిల్పకళలో ప్రతీ అంగుళం ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించే క్షణం నుంచే భక్తి తరంగాలు మనసును తాకుతాయి. రంగనాథస్వామి విగ్రహం చూడగానే భగవంతుడి సాక్షాత్కారమే అనిపిస్తుంది.
తంజావూరు – బృహదీశ్వర దేవాలయం
తదుపరి గమ్యం తంజావూరు. చోళ వంశపు వైభవాన్ని ప్రతిబింబించే ఈ నగరంలోని బృహదీశ్వర దేవాలయం అంటే మహత్తరమైన శిల్పకళా అద్భుతం. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం కూడా. ఒకే పెద్ద రాతితో చేసిన గోపురం, గోడలపై అద్భుతమైన చిత్రాలు, ప్రాంగణంలో కనిపించే సింహాలు, దేవతా విగ్రహాలు అన్నీ చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఆలయాన్ని పెద్ద కోవిల్ అని పిలుస్తారు. ఇక్కడి వాతావరణం, సంగీతం, చరిత్ర ప్రతి అంశం మనల్ని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది.
కుంభకోణం అదికేసవ పెరుమాళ్ ఆలయం
తదుపరి మన ప్రయాణం కుంబకోణం వైపు. ఈ పట్టణం దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి వీధి ఒక దేవాలయానికి దారి తీస్తుంది అన్నట్లుంది. మహామహం చెరువు, ఆదికుంబేశ్వర స్వామి దేవాలయం, సరంగపాణి దేవాలయం, అదికేశవ పెరుమాళ్ ఆలయం వంటి పవిత్ర స్థలాలు ఇక్కడ మనల్ని ఆకర్షిస్తాయి. మహామహం పండుగ సమయంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చూడటానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఈ ప్రాంతంలోని వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది.
పుదుచ్చేరి – శ్రీ అరవిందో ఆశ్రమం
తరువాతి గమ్యం పుదుచ్చేరి. ఫ్రెంచ్ వాతావరణం, సముద్ర తీరాలు, ప్రశాంతమైన వాతావరణం ఈ నగరాన్ని చూసినవారు మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. శ్రీ అరవిందో ఆశ్రమం ఇక్కడి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. సముద్రతీరంలో ఉదయం సూర్యోదయం చూడటం అనేది ఒక దివ్య అనుభూతి. ఇక్కడి వీధులు, భవనాలు,
తినే ఆహారం అన్నీ మనసును ప్రశాంతంగా మారుస్తాయి.
అరుణాచలం అన్నామలయ్యార్ స్వామి దేవాలయం
చివరగా యాత్ర చేరేది అరుణాచలం. ఇక్కడ ఉన్న అన్నామలయ్యార్ స్వామి దేవాలయం అగ్నిలింగ స్వరూపంగా ప్రసిద్ధి. ఈ ఆలయానికి సంబంధించిన కథలు, అద్భుతమైన గోపురం, కార్తిక మాసంలో జరిగే దీపోత్సవం చూసి ఆ దేవుని శక్తిని అనుభూతి చెందవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. పర్వతం పై వెలిగే ఆ దీపం ఒక చిహ్నం మాత్రమే కాదు, విశ్వంలోని దివ్యశక్తికి సూచిక.
యాత్ర పేరు టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు
టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు అనే పేరుతో హైదరాబాదు నుండి నేరుగా విమాన మార్గంలో 6 రాత్రులు, 7 రోజుల ఆధ్యాత్మిక యాత్ర ప్యాకేజ్‌ను ప్రారంభించింది.
ఈ యాత్రలో భోజనం, వసతి, గైడ్ సౌకర్యాలు అన్నీ ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తుంది. హైదరాబాదు నుండి విమానంలో బయలుదేరి, తిరిగి అదే మార్గంలో వచ్చేంత వరకు పూర్తిగా సౌకర్యవంతమైన ప్యాకేజ్ అందుబాటులో ఉంటుంది. ప్యాకేజ్ ధర రూ.34,600 మాత్రమే.
ప్యాకేజ్ వివరాలు- ఎలా సంప్రదించాలి?
ఇది కేవలం ఒక పర్యటన కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర. తమిళనాడు ఆలయాల భవ్యతను చూడాలనుకునే ప్రతి భక్తుడికి ఇది జీవితంలో తప్పక చేయాల్సిన యాత్ర. శిల్పకళా అద్భుతాలు, చరిత్ర వైభవం, దేవాలయాల దివ్యత అన్నీ ఒకే పర్యటనలో అనుభవించాలంటే ఈ టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు టూర్ ప్యాకేజ్‌ను ఇప్పుడే బుక్ చేసుకోండి. వివరాలకు www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించండి. సీట్లు పరిమితంగా ఉన్నాయి, ఆలస్యం చేయకండి.