Rahul Ravindran: సినీ నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)అందాల రాక్షసి సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే హీరోగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన దర్శకుడిగా మారారు. రాహుల్ దర్శకత్వంలో చిలసౌ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఏకంగా ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
పొరపాట్లు జరిగిపోయాయి..
ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ రవీంద్రన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు మన్మథుడు2 (manmadhudu2)గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నాగార్జున(Nagarjuna), రకుల్ ప్రీతిసింగ్(Rakul Preethi Singh) హీరో హీరోయిన్లుగా తేరికెక్కిన ఈ సినిమాకు రాహుల్ దర్శకత్వం వహించిన సంగతే తెలిసిందే. అయితే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
తాజాగా ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈ సినిమా రిజల్ట్ తర్వాత నాగార్జున రియాక్షన్ ఏంటి అనే విషయాల గురించి రాహుల్ రవీంద్రన్ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ..మన్మథుడు 2 సినిమా మేకింగ్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. ఈ సినిమా నుంచి తాను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో నేను కాస్త కంగారు పడ్డాను. ఆ సమయంలో నాగార్జున గారి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు.
రాహుల్ నువ్వేమీ కంగారు పడకు… ప్రస్తుతం ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన రేపటికి పికప్ అవుతుందని భరోసా ఇచ్చారు. అయితే సినిమా రిజల్ట్ అలాగే ఉన్న నేపథ్యంలో మూడు రోజులకు నాగార్జున గారు ఫోన్ చేసి ఈ సినిమాకు ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు నిజమైనదే మనం దానిని యాక్సెప్ట్ చేయాలి కానీ నువ్వేమీ కంగారు పడకు. ఈ సినిమా ద్వారా అందరికీ చాలా మెమోరీస్ ఉన్నాయి వాటిని పాడు చేసుకోవద్దు. కొన్నిసార్లు ఇలా జరగడం మామూలే అంటూ ఆయన నాకు ఫోన్ చేసి ఎంతో సపోర్ట్ ఇచ్చారని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. నాగార్జున వంటి ఒక లెజెండరీ యాక్టర్ తో సినిమా చేశాను అనే ఫీలింగ్ నాకు ఉందని, అలాగే ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు. ఇక నాగార్జున నటించిన మన్మథుడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా మన్మథుడు2 ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
Also Read: The Raja Saab: గ్లోబల్ రేంజ్ లో రాజాసాబ్ ప్రమోషన్స్..10 రోజులకు ఒక అప్డేట్ అంటూ!