Aishwarya Rai Bachchan (Source: Instragram)
మాజీ విశ్వసుందరిగా తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె 22వ సారి కేన్స్ చిత్రోత్సవంలో సందడి చేసింది. ముఖ్యంగా తన వస్త్రధారణ, అలంకరణతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Aishwarya Rai Bachchan (Source: Instragram)
వాస్తవానికి ఈమె ఏ వేడుకకు హాజరైనా సరే చాలా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది..ఈ క్రమంలోనే 2025 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన ఈమె ఇక్కడ కూడా మరొకసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
Aishwarya Rai Bachchan (Source: Instragram)
భారతీయత ఉట్టిపడేలా చీరతో వచ్చిన ఈమె నుదిటిన సింధూరంతో అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది.
రెడ్ కలర్ రూబీ హారం ధరించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది ఐశ్వర్యారాయ్.
Aishwarya Rai Bachchan (Source: Instragram)
ఇకపోతే 78వ కేన్స్ చిత్రోత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఈ వేడుకలకు హాజరైన ఈమె అలరించింది. 2002లో తొలిసారి ఈ వేడుకల్లో మెరిసిన ఈమె అప్పటినుంచి ప్రతి ఏడాది కూడా ఈ కేన్స్ చిత్రోత్సవంలో తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.. ఇక ఈ సంవత్సరం హాఫ్ వైట్ కలర్ జెరీ అంచు బెనారస్ చీర, టిష్యూ డ్రేప్ , మెడలో హారాలు ఇలా రాయల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంది.
Aishwarya Rai Bachchan (Source: Instragram)
ఇకపోతే ఈమె ధరించిన సింధూరం రెండు విషయాలను స్పష్టంగా తెలియజేస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను కేన్స్ వేదికగా తన లుక్ తో మద్దతు ఇచ్చింది ఐశ్వర్య.
Aishwarya Rai Bachchan (Source: Instragram)
ఇక మరొకటి గత కొన్ని నెలలుగా తన భర్త నుండి విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో వీటికి తన లుక్కుతో చెక్ పెట్టింది. అభిషేక్ పై ఉన్న ప్రేమను ఐశ్వర్య ప్రపంచానికి తెలియజేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.