neha shetty (1)
Neha Shetty Latest Photos: హీరోయిన్ నేహా శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క సినిమాతో ఈ భామ సెన్సేషన్ అయ్యింది. నిజానికి ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగుపెట్టిన ఆశించిన స్థాయిలో గుర్తింపు అందుకోలేకపోయింది.
neha shetty (2)
కానీ, సిద్ధు జోన్నలగడ్డ డిజే టిల్లు చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒక్కసారిగా ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. రాధిక రాధిక అంటూ కుర్రాళ్లంత ఆమె జపమే చేశారు.
neha shetty (3)
ఇక సోషల్ మీడియాలో రాధిక పేరుకు వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. డిజే టిల్లుతో ఈ బ్యూటీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఆ కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ చిత్రంలో సమ్మోహనుడా పాటతో మంచి గుర్తింపు పొందింది.
neha shetty (4)
ఇక ఆమెకు వచ్చిన స్టార్ డమ్‌తో టాలీవుడ్లో బిజీ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఈక్రేజ్ ఆమెకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. అంతటి క్రేజ, ఫాలోయింగ్ వచ్చినప్పటి ఈ నేహా శెట్టికి పెద్దగా అవకాశాలు రావడం లేదు.
neha shetty (5)
డిజే టిల్లు టైంలో ఓ వైపు స్టార్డమ్ మరోవైపు వరుస ఫోటో షూట్స్‌తో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ తన సందడి తగ్గించేసింది.
neha shetty (6)
అప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఫోటోలు షేర్ చేసి అలరించిన ఈ భామ ఈ మధ్య కాస్తా గ్యాప్ తీసుకుంటోంది. ఈ క్రమంలో నేహా శెట్టి తాజాగా తన ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం మాల్దీవ్స్ వెకేషన్లో ఉంది.
neha shetty (7)
అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చీల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
neha shetty (8)
'మాల్దీవ్స్.. ఒక కలలా ఉంది. నా కోసమే తయారు చేసినట్లుగా అనిపించేలా ఉంది ఈ హాలిడే ట్రిప్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
neha shetty (9)
ఇందులో నేహా లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.