Mandula Samuel: తుంగతుర్తి రాజకీయ హవా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇసుక దందాపై వస్తున్న ఆరోపణలతో తుంగతుర్తి రాజకీయం యూటర్న్ తీసుకుంది. హరీశ్ రావు ఆరోపణలతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను ఇసుక దందా చేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే, పోయి లారీ కింద పడతా” అని ఆయన చెప్పడం స్థానిక రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది. హరీశ్ రావు, తన నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. అసలు నీటి విలువ హరీశ్ రావుకు తెలుసా? హరీష్ రావుకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసంటూ మండిపడ్డారు. నీటి గురించి హరీశ్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
Also Read: Okra Water Benefits: జిడ్డుగా ఉందని వదిలేయకండి.. నానబెట్టి తాగితే రోగాలన్నీ పరార్
మందుల సామేల్ మాట్లాడుతూ.. కాళేశ్వరానికి నేనే ఇంజనీర్ ను, కంకర మోసింది నేనే, రాళ్లు మోసింది నేనే అని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కుప్పకూలింది . కాళేశ్వరం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్లు తెలిసింది దోపిడీ, దొంగతనాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే భార్యా, భర్తలు మాట్లాడుతుంటే దొంగచాటుగా వినడం ఇలాంటివి మాత్రమే వాళ్లకు తెలుసని అన్నారు. కొద్ది రోజులు ఆగండి ఆ వ్యవహారం కూడా త్వరలో బయటకు వస్తుందన్నారు. కాళేశ్వరం కమీషన్ కథ వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. స్వర్గీయ నాయని నర్సింహారెడ్డి అప్పుడే అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరానికి తొర్ర ఎందుకు పడిందో తలపెట్టి హరీశ్ రావును చూడమని అన్నారు.
గతంలో కిషోర్, జగదీశ్ రెడ్డి ఇసుక మొత్తం దోచుకున్నారని ఆరోపించారు. అధ్యక్ష పదవి కోసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారని తీవ్రంగా స్పందించారు. వాళ్లకు తెలంగాణపై, రాష్ట్ర ప్రజలపై సోయ లేదని వారన్నారు. నాణ్యత లేకుండా కాళేశ్వరం కట్టి ఇప్పుడు పక్కనున్న వారిపై నిందలు మోపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది తెలంగాణ కోసం పోరాడి మీ చేతిల్లో పెడితే బీఆర్ఎస్ వాళ్లు చేసిన తతంగం ఇది అంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ అంటూ మండిపడ్డారు.
నేను ఇసుక దందా చేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే పోయి లారీ కింద పడతా : ఎమ్మెల్యే మందుల సామేల్
హరీష్ రావుకు వ్యవసాయం గురించి ఏం తెలుసు?
నేనే ఇంజనీర్ ను, కంకర మోసింది నేనే, రాళ్లు మోసింది నేనే అని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కుప్పకూలింది
ఎవడైనా భర్తభార్యలు… pic.twitter.com/BFFr1DUfgA
— BIG TV Breaking News (@bigtvtelugu) August 20, 2025