IND VS PAK Women: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళల జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంటులో శ్రీలంక పై మొదటి మ్యాచ్ విజయం సాధించి టీమిండియా మహిళల జట్టు మంచి ఊపులో ఉండగా.. బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ టీమిండియా మహిళలు వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా మరోసారి షేక్ హ్యాండ్ వివాదం తెరపైకి వచ్చింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసినట్లుగానే మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా వ్యవహరించారు. పాకిస్తాన్ కెప్టెన్ సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే వెళ్లిపోయారు హర్మన్ ప్రీత్ కౌర్. ఇక టీమ్ ఇండియా కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో అవమానంగా భావించిన పాకిస్తాన్ కెప్టెన్ సనా అక్కడి నుంచి కిందికి ముఖం పెట్టుకొని వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
కొలంబో వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ హాట్స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఉచితంగానే చూడవచ్చు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఒకసారి రికార్డులు పరిశీలిస్తే… ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 11 వన్డేలు జరిగాయి. ఈ 11 వన్డేల్లో టీం ఇండియా అనే పదకొండు మ్యాచ్ లలో విజయం సాధించింది. అంటే ఒక్క మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ గెలవలేకపోయింది. టి20 లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టి20 లలో రెండు జట్ల మధ్య 13 మ్యా్ లు జరిగితే పది మ్యాచ్ లలో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. కేవలం 3 మ్యాచ్లలో మహిళల పాకిస్తాన్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది.
పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, రమీన్ షమీ, అలియా రియాజ్, సిద్రా నవాజ్(w), ఫాతిమా సనా(c), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్
భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(w), స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
Indian women's skipper didn't shake hands with the Pakistan women's skipper Fatima Sana during toss
📸: JioHotstar #INDWvsPAKW #ODIs #CWC25 #WomensCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/wilrTU5WXN
— InsideSport (@InsideSportIND) October 5, 2025