SLBC టన్నెల్ లో 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. నేటికి 6 రోజులుగా ఆ కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
ప్రమాదం జరిగి కార్మికులు చిక్కుకున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఎలాగైనా 8 మంది కార్మికుల జాడ తెలుసుకోవాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు ప్రారంభించారు.
అయితే టన్నెల్ మొత్తం 14 కిలో మీటర్లు ఉండగా, 13 వ కిలోమీటర్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర విభాగాలకు చెందిన రెస్క్యూ టీమ్ టన్నెల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి.
కానీ రెస్క్యూ టీమ్ ధైర్యంగా టన్నెల్ లోపలికి వెళ్లి ప్రస్తుతం ఆపరేషన్ సాగిస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రెస్క్యూ టీం సభ్యులు హై రిస్క్ లో టన్నెల్ లోపల కార్మికుల జాడ కోసం ప్రయత్నిస్తున్నారు.
గురువారం ఎట్టకేలకు ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి తక్కువ దూరానికి చేరుకున్న రెస్యూ టీమ్, కూలిపోయిన మట్టిని త్వరగా తీసి కార్మికుల జాడ కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని తెలిపారు.
కాగా రెస్క్యూ సిబ్బంది టన్నెల్ లోపల చేపట్టిన ఆపరేషన్ కు సంబంధించి పలు ఫోటోలు విడుదలయ్యాయి.
ఈ ఫోటోలు రెస్క్యూ టీమ్ చేస్తున్న రిస్క్ కు నిదర్శనమని అధికారులు తెలుపుతున్నారు.
సాధ్యమైనంత త్వరగా గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు టన్నెల్ వద్ద ఉంటూ.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు.