Indian Railways: ప్రపంచంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే వ్యవస్థ. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేసేది కూడా భారతదేశ రైల్వేలోనే. ఇండియన్ రైల్వేలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. రవాణా ఛార్జీలు తక్కువగా ఉన్న కారణంగా చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. పేదలు, మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువగా రైలులోనే ప్రయాణం చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మామూలుగా ఇండియన్ రైల్వే విధానంలో ట్రైన్ టికెట్లను 2 నెలలు ముందు గానే బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. తత్కాల్ టికెట్, ప్రయాణానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవచ్చు. అదే కొన్ని గంటల ముందు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్ బుకింగ్ చేసుకోవడం కష్టమైన పనే. అయితే ఇప్పుడు రైలు బయలుదేరడానికి నిమిషం ముందు కూడా టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఓసారి చూద్దాం.
ALSO READ: BHEL Recruitment: డిగ్రీ అర్హతతో భెల్‌లో 400 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా..
అయితే, చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ ట్రైన్ టికెట్లను చివరి నిమిషంలో కానీ.. రైలు బయలుదేరే ముందు కానీ బుక్ చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ విధానంలో చార్టింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు లేదా బెర్త్ లను మళ్లీ అందుబాటులోకి తెస్తారు. ట్రైన్ ప్రారంభమయ్యే అరగంట ముందు వరకు ప్రయాణికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఇలాంటి టికెట్ బుకింగ్స్ పై పది శాతం వరకు తగ్గింపు ఇచ్చేవారు. అయితే 2023 నుంచి జనరల్ రిజర్వేషన్ల కోసం వసూలు చేసిన ఛార్జీలే.. ఈ టికెట్ రిజర్వేషన్ కు కూడా వసూలు చేస్తున్నారు.
ALSO READ: BEL Recruitment: బెల్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.50,000.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..
ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా ఈ టికెట్లను ఎలా బుక్ చేయాలో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం..
1. ముందుగా యాప్ లోకి లాగిన్ అవ్వాలి.. ఆ తర్వాత మీరు వెళ్లే గమ్య స్థానాన్ని ఎంటర్ చేయాలి.
2. మీరు ఈ టికెట్ బుక్ చేసేటప్పుడు బుకింగ్ డేట్ ను నమోదు చేయాలి. అంటే అదే రోజును నమోదు చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఫిబ్రవరి 28, 2025న టికెట్ కావాలంటే అదే ప్రయాణ తేదీని ఎంటర్ చేయాలి. స
3. అప్పుడు ఆ రూట్ లో అందుబాటులో ఉన్న రైళ్ల జాబితాను చూపిస్తుంది. కావాల్సిన క్లాస్ లేదా కంపార్ట్ మెంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
4. అప్పుడు టిక్కెట్ కరెంట్ అవైలబుల్ గా కనిపిస్తాయి. అప్పడు ఈజీ గా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ALSO READ: Group-D Jobs: 32000 ఉద్యోగాలకు ఇంకా రెండు రోజులే మిత్రమా.. ఆలస్యం వద్దు..!
రద్దీ తక్కువ ఉండే మార్గాల్లో ఈ టికెట్లు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కరెంట్ బుకింగ్ ఆన్ లైన్ లో మాత్రమే చేయవచ్చని ప్రయాణికులు గమనించాలి. అంతే కాకుండా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి. ప్రయాణికులు ఈ టికెట్లను ఉపయోగించి బుక్ చేసిన టికెట్ల కోసం బోర్డింగ్ పాయింట్ ను మార్చలేరు.