BigTV English
Advertisement

Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

Mokshagna: బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.. మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా..?

Mokshagna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ వారసుడు కోసం కూడా.. ఏ హీరో అభిమాని ఇంతగా ఎదురు చూడలేదు అని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబం (Nandamuri Family) నుంచి రాబోయే రెండవ తరం వారసుడు కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరొకవైపు అదే నందమూరి కుటుంబం నుండి మూడవ తరం వారసులు కూడా ఎంట్రీ ఇస్తున్నా.. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీకి మాత్రం ముహూర్తం కుదరకపోవడం అందరిని పూర్తిస్థాయిలో నిరాశకు గురి చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం లో ఇండస్ట్రీకి లాంచ్ కాబోతున్నారని, అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


అంతేకాదు గత ఏడాది మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ వర్మ – మోక్షజ్ఞ మూవీ నుంచి మోక్షజ్ఞ మొదటి లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మోక్షజ్ఞ చాలా సన్నబడిపోయి కనిపించడంతో పర్ఫెక్ట్ హీరో లుక్ అని అందరూ అనుకున్నారు. అయితే ఆరోజు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కానీ ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడం అభిమానులలో పూర్తి నిరాశను కలిగిస్తోంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప ఇప్పటివరకు ఈ షూటింగ్ కు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదనే చెప్పాలి. మరొకవైపు ఈ షూటింగుకి ముహూర్తం ఫిక్స్ చేశారని త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది అని చెప్పారు. కానీ ప్రస్తుతం అన్నిటికీ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని దానికి తోడు ప్రశాంత్ వర్మ కు ప్రభాస్ (Prabhas) ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఇక ఇప్పటికే ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా అయిపోయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని సమాచారం. ఇక ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమా ఆగిపోయిందని, అందుకే ఇప్పుడు మోక్షజ్ఞ దృష్టి ప్రభాస్ పై పడింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని గట్టిగా నమ్మిన బాలయ్య అభిమానులకు ఇది అతి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అటు బాలయ్య కూడా మోక్షజ్ఞని పక్కా ప్లానింగ్ తోనే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. మొదటి సినిమాకే ఇంత ఆలస్యం అవుతోంది అంటే ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? ఏ ఒక్క వారసుడి కోసం ఇంతలా ఎదురు చూడలేదు..? అంటూ నెటిజన్స్ కూడా కామెంట్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంత జరుగుతున్నా కూడా అటు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోవడం అటు బాలయ్య కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో అభిమానులలో సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఇప్పటికైనా అభిమానులలో అనుమానాలు తీరేలా మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. కనీసం బాలయ్య నుంచైనా ఒక స్పందనైనా రావాలి అని నందమూరి అభిమానులు కోరుకుంటుండడం గమనార్హం.


Roja – Meena: ఇరగదీసిన మీనా, రోజా.. ఈ వయసులో కూడా ఊపు తగ్గలేదంటూ..?

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×