శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామస్మరణతో ఆలయం మారు మ్రోగుతోంది.
భక్తులతో పాటు శివమాల ధరించిన స్వాములు పెద్ద ఎత్తున శ్రీశైలంకు చేరుకున్నారు.
పలువురు భక్తులు ఉపవాసాన్ని ఆచరిస్తూ.. శ్రీశైల మల్లన్న పట్ల తమకు ఉన్న భక్తిని చాటుకుంటున్నారు.
అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీశైల మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం కు వచ్చే రహదారులన్నీ వాహనాలతవం రద్దీగా మారాయి.
ఓం నమశ్శివాయ అంటూ భక్తులు ఎందరో కాలినడకన శ్రీశైలంకు చేరుకుంటున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదివ రోజైన మహాశివరాత్రి రోజున శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి.
తరువాత యాగశాల యందు శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేయబడ్డాయి. మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తులో పాల్గొని భక్తుల సేవలో తరిస్తున్నారు