Hema Malini: బాలీవుడ్‌లో ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా హీరో, హీరోయిన్ చాలా బోల్డ్‌గా ఉంటారని, యాక్టింగ్ కోసం ఏదైనా చేస్తారని అంటుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా యాక్టింగ్ కోసం ఎంత దూరం అయినా వెళ్లే నటీనటులు ఉన్నా.. బోల్డ్‌గా యాక్ట్ చేయాలంటే అది బాలీవుడ్ యాక్టర్స్‌తోనే సాధ్యమని ప్రేక్షకులు భావిస్తుంటారు. అలా తాజాగా అమితాబ్ బచ్చన్, హేమ మాలిని కలిసి నటించిన సినిమా కోసం హేమ మాలిని చేసిన పని గురించి బయటపెట్టారు దర్శకుడి భార్య. ఆమె చెప్పింది విన్న తర్వాత ఆడియన్స్ అంతా షాకవుతున్నారు. హేమ మాలిని లాంటి సీనియర్ హీరోయిన్ ఇలా ఆలోచిస్తుందా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.
కెమిస్ట్రీ కోసం
అమితాబ్ బచ్చన్, హేమ మాలిని జంటగా నటించిన ‘బాఘ్‌బన్’ (Baghban) మూవీ 2003లో విడుదలయ్యింది. ఈ సినిమాను రవి చోప్రా డైరెక్ట్ చేశారు. ఇందులో రాజ్ మల్హోత్రా, పూజా మల్హోత్రా పాత్రల్లో భార్యాభర్తలుగా అమితాబ్, హేమ మాలిని కెమిస్ట్రీ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కానీ ఆ కెమిస్ట్రీ అలా రావడం కోసం హేమ మాలిని ఏం చేశారనే విషయాన్ని రవి చోప్రా భార్య రేణు చోప్రా బయటపెట్టారు. అమితాబ్‌తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండాలంటే ఏం చేయాలో హేమ మాలినినే నిర్ణయించేవారని చెప్పుకొచ్చారు. అలా ఒక సీన్‌లో కెమిస్ట్రీ బాగా కుదరడం కోసం కావాలనే తన బ్లౌజ్‌ను చాలా టైట్‌గా కుట్టమని చెప్పారట హేమ మాలిని. ఇది విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
టైట్‌గా కుట్టండి
‘‘ఒక సీన్‌లో హీరోయిన్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటుంది. అదే సమయంలో హీరో వెనక నుండి వచ్చి తనను చూసి వావ్ అంటాడు. ఆ సీన్‌లో తను ధరించే బ్లౌజ్‌ను టైట్‌గా కుట్టమని హేమ మాలిని చెప్పారు. ఎందుకంటే ఆ సీన్‌లో అమితాబ్ తన దగ్గరకు వచ్చి టచ్ చేయగానే ప్రేక్షకులకు కావాల్సిన లుక్ నేను ఇవ్వగలను అని అన్నారు. హీరో పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్‌ను టచ్ చేస్తాడు. ఆ లుక్ చాలా ముఖ్యం అని హేమ మాలిని (Hema Malini) సలహా ఇచ్చారు. ఆమె రియల్ లైఫ్‌లో చాలా రొమాంటిక్’’ అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు రేణు చోప్రా. అయితే ముందుగా ‘బాఘ్‌బన్’లో హీరోయిన్‌గా హేమ మాలిని కాకుండా మరొక హీరోయిన్‌ను పరిగణనలోకి తీసుకున్నారట.
Also Read: మెగా హీరోకి విలన్‌గా సంజయ్ దత్.. ఈ హిందీ హీరోకి ఒకే ఒక్క డిమాండ్
భారీ లాభాలు
‘బాఘ్‌బన్’లో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) భార్యగా నటించడం కోసం ముందుగా టబు పేరును పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్. కానీ ఇందులో నలుగురు పిల్లలకు తల్లిగా యాక్ట్ చేయాలి అని చెప్పగానే టబు వెనక్కి తప్పుకుందని సమాచారం. కానీ ఆ తర్వాత తను ఈ రోల్ రిజెక్ట్ చేసినందుకు చాలా ఫీల్ అయ్యిందని చెప్పుకొచ్చారు రేణు చోప్రా. ఈ సినిమా కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.45 కోట్ల వసూళ్లను సాధించి సూపర్ హిట్ అయ్యింది.