
శ్రీశైల మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలంకు చేరుకుంటున్నారు.

కొందరు కాలినడక, మరికొందరు వాహనాలలో శ్రీశైలానికి చేరుకుంటుండగా, ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.

భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగుతోంది.

గురువారం రాత్రి స్వామి వారికి భృంగి వాహన సేవ సాగించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.

స్వామి వారికి హారతులిస్తూ.. ప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు.

అలాగే ఆలయ అధికారుల అధ్వర్యంలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీశైలం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.