NABARD Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నాబార్డ్ లో ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు లేదా ఎల్ఎల్ బీ, సీఏ, సీఎస్, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నాబార్డులో 91 ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పోస్టులను బర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నవంబర్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 91
నాబార్డులో ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ఆఫీసర్స్ గ్రేడ్ ఏ పోస్టులు: 91
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఎల్ఎల్ బీ, ఏదైనా మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎస్, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.44,500 నుంచి రూ.89,150 వరకు జీతం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 8
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 30
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: nabard.org
పోస్టులు- వెకెన్సీలు:
అసిస్టెంట్ మేనేజర్ : 85 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీసెస్) : 2 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్) : 4 పోస్టులు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 ఫీజు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 91
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 30