Shamshabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడి కాపులు కాస్తున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్ ఇప్పటి వరకు రాకపోవడంతో.. 200 మంది ప్రయాణికులు రాత్రి నుండి ఆందోళన చేస్తున్నారు. వియత్నాం ఎయిర్ బస్ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వక పోగా ప్లైట్ ఎప్పుడు టేకాఫ్ అవుతుందో కూడా చెప్పడం లేదంటూ ప్రయాణికులు తెలుపుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే విమానం టేకాఫ్ కాలేదని తామేం చేయలేమని విమానాశ్రయం అధికారులు చేతులెత్తేశారు.