Abhishek Sharma : టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ టీ-20 ఫార్మాట్ లో అతి తక్కువ బంతుల్లోనే 1000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా ఈ లెప్ట్ ఆర్మ్ బ్యాట్స్ మెన్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టీ-20 మ్యాచ్ సందర్భంగా శనివారం మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేసాడు. అయితే ఈ మ్యాచ్ లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అభిషేక్ శర్మకు లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్ ను గ్లెన్ మ్యాక్స్ వెల్ జారవిడిచాడు. అలాగే 13 పరుగుల వద్ద ఉన్న వేళ బెన్ డ్వార్షుయిస్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్ కి రెండు లైఫ్ లు లభించినట్టయింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు. 11 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద అంతర్జాతీయ టీ-20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతను తీసుకున్న బంతులు కేవలం 528 కావడం విశేషం.
Also Read : Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆపరేషన్ కు సాయం !
పంజాబ్ కి చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటి.. గత ఏడాది టీమిండియాలో అడుగు పెట్టాడు. టీ-20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ శర్మ. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన లో ఉన్న అభిషేక్ శర్మ.. కంగారు గడ్డపై సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగా ఆసీస్ తో ఆడిన నాలుగు టీ-20 మ్యాచ్ ల్లో వరుసగా 19, 68, 25, 28 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే భారత్ తరపున ఇప్పటివరకు 28 మ్యాచ్ లు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ 521 బంతుల్లో 989 పరుగులు సాధించాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే 2-1 తో ఆధిక్యంలో ఉన్నటీమిండియా బ్రిస్బేన్ లో చివరి టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే గాబా మైదానంలో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ కి దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్ ధనాధన్ దంచి కొట్టడంతో 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు సాధించింది. మెరుపులు.. వర్షం మొదలు కావడంతో అక్కడికి ఆటను నిలిపివేశారు. ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్ పిలిచారు.
మరోవైపు తాజాగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 5వ టీ-20 మ్యాచ్ బ్రిస్టెన్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే వెదర్ కారణంగా 4.5 ఓవర్ల తరువాత మ్యాచ్ నిలిచి పోయిన విషయం తెలిసిందే. అయితే అటు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రేక్షకులను స్టేడియం సిబ్బంది అప్రమత్తం చేశారు. బహిరంగ ప్రదేశాలు వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బిగ్ స్క్రీన్ల పై చూపించారు. మరోవైపు ఈ మ్యాచ్ జరిగేది కాస్త డౌట్ అని తెలుస్తోంది. ఈ మ్యాచ్ రద్దు అయితే టీమిండియానే సిరీస్ గెలుస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. టీమిండియా విజయం సాధిస్తే.. సిరీస్ ను గెలుచుకుంటుంది.
Also Read : Mohammed Shami : రూ .4 లక్షలు చాలడం లేదు నెలకు రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే..షమీ భార్య సంచలనం
🚨 HISTORY FOR ABHISHEK SHARMA 🚨
– Abhishek Sharma becomes the fastest Ever to complete 1000 runs in T20I Int'l History. 🥶 pic.twitter.com/soX9geG1cA
— Tanuj (@ImTanujSingh) November 8, 2025