Actress Anandi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొంతమంది తెలుగు అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నటి ఆనంది (Anandi)కూడా ఒకరు. ఇప్పటికే పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఆనంది త్వరలోనే ప్రేమంటే(Pewmante) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నవనీత్ శ్రీరామ్(Navaneeth Sriram) దర్శకత్వంలో ప్రియదర్శి ఆనంది జంటగా నటించిన ప్రేమంటే సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నటి ఆనంది బిగ్ టీవీతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆనంది తన వ్యక్తిగత విషయాలు అలాగే వృత్తిపరమైన విషయాలను గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ప్రేమంటే సినిమా కచ్చితంగా మీ అందరిని ఆకట్టుకుంటుందని ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని తెలిపారు. టీజర్ లో చూపించిన సన్నివేశాలు కంటే కూడా ఈ సినిమా రెండింతలు ఉండబోతుందని ఆనంది తెలిపారు.. ఈ సినిమాలో రమ్య పాత్రకు నేను బాగా కనెక్ట్ అయ్యానని ఈమె సినిమా గురించి మాట్లాడుతూ భారీగా అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమాలో హైపర్, ఆది ఆటో రాంప్రసాద్, వెన్నెల కిషోర్, సుమా కనకాల(Suma Kanakala) వంటి వారందరూ కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఇక సుమ కనకాల సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నారు అయితే సుమ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.. సుమ గారు చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు అయితే సినిమా షూటింగ్లో మాత్రం ఈమె తన షాట్ అయిపోగానే చాలా సైలెంట్ గా కూర్చుంటారు ఎందుకు అలా ఉన్నారు సుమ గారు అంటే ఎనర్జీ రీఛార్జ్ చేసుకుంటున్నానని చెప్పేవారు. సుమ గారు చాలా స్వీట్ అంటూ తన గురించి మాట్లాడారు. అయితే ఈ సినిమా కోసం మేమంతా నైట్ షూటింగ్స్ ఎక్కువగా చేశామని కేవలం 50 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందని ఆనంది తెలిపారు.
ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ చూసి మీరు ఒక అవగాహనకు రావద్దు ,సినిమా మీరు ఊహించిన దానికంటే పదింతలు ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. ఇక ప్రేమంటే సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా లవ్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రానా దగ్గుబాటి సమర్పణలో.. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ వీడియో సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా మొత్తం భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, వారి మధ్య జరిగే గొడవలు నేపథ్యంలో ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. మరి నవంబర్ 21వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Actor Ajay: చిరంజీవి కంటే బాలయ్య అంటేనే ఇష్టం… రెమ్యునరేషన్ పై అజయ్ షాకింగ్ కామెంట్స్!