Sai Kiran Shared Wife Baby Shower: నటుడు సాయి కిరణ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడు. ఆయన భార్య స్రవంతి గర్భవతితో ఉన్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సాయి కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా సాయి కుమార్ సీరియల్ నటి స్రవంతిని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్ 7న వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
పెళ్లయిన కొన్ని నెలలకే ఆమె గర్భం దాల్చినట్టు తెలిపారు. తాజాగా ఆమెకు గ్రాండ్‌గా సీమంతం జరిగింది. ఇందులో సాయి కుమార్ భార్య చేతికి గాజులు తొడుగుతూ ఆమెను ఆశీర్వాదించాడు. శ్రీమంతంలో ఆమె పక్కనే ఉంటూ శ్రీమతిని చూసుకుంటూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ ఆకట్టుకుంటోంది. కాగా సాయి కిరణ్ స్రవంతిలు కోయిలమ్మ సీరియల్లో నటించాడు. ఇందులో సాయి కిరణ్‌కి వదినగా నటించింది స్రవంతి. ఈ సీరియల్ ద్వారా వీరిద్దరికి పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సీరియల్లో నటించిన వీరు ప్రేమలో పడ్డారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం వీరిద్దరు భానుమతి సీరియల్లో భార్యభర్తలుగా నటిస్తున్నారు. అయితే సాయి కిరణ్ స్రవంతి రెండో భార్య అనే విషయం తెలిసిందే. మొదట 2010లో స్రవంతి అనే అమ్మాయితో పెళ్లయ్యింది. ఆ తర్వాత వీరిద్దరికి ఒక కూతురు కూడా జన్మిచ్చిందని సమాచారం. కాగా కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత స్రవంతిని ప్రేమించి గతేడాది 2024లో పెళ్లి చేసుకున్నాడు సాయి కిరణ్. మొదట హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నువ్వే కావాలి చిత్రంలో సెకండ్ హీరోగా పరిచయం అయ్యాడు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ఆ తర్వాత ప్రేమించు సినిమాతో హీరోగా గుర్తింపు పొంది సాయి కిరణ్.. మనసుంటే చాలు, ఎంత బావుందో, జగపతి, షిరిడి సాయి, నక్షత్రం తదితర చిత్రాల్లో నటించాడు. అవి పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. క్యారెక్టర్ ఆర్టిస్టు సహాయ నటుడు పాత్రల్లో కనిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత విడాకులు కారణంగా సినిమాలకు దూరమయ్యాడు. లాంగ్ గ్యాప్ తర్వాత సీరియల్స్ రీఎంట్రీ ఇచ్చాడు. కోయిలమ్మాతో బుల్లితెరపై అడుగుపెట్టిన సాయి కిరణ్ ప్రస్తుతం వరుస సీరియల్లో నటిస్తూ బిజీగా మారాడు. కోయిలమ్మ, పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు, భానుమతి వంటి సీరియల్స్‌లో తండ్రి పాత్రల్లో మెప్పిస్తున్నాడు.