Anchor Suma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాంకర్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు సుమ. ఏ ఈవెంట్ అయినా అలవోకగా మాట్లాడగలుగుతారు. కొన్ని సినిమాలకి సంబంధించి టెక్నీషియన్స్ మారుతుంటారు కానీ సినిమా ఈవెంట్లకు మాత్రం యాంకర్ గా సుమ మారదు. అయితే సుమ ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో కూడా యాంకరింగ్ చేసినప్పుడు ఎదుర్కొన్న కష్టాలను రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ అప్పుడు అశోక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను. ఎన్టీఆర్ తో పాటు చాలామంది జనాలు వస్తారు కదా, యాంకరింగ్ అయిపోయిన తర్వాత స్టేజి దిగి, యూసఫ్ గూడా స్టేడియంలో అటు నుంచి ఒక డోర్ ఉంది ఇటునుంచి ఒక డోర్ ఉంది.
మేము బ్యాక్ డోర్ నుంచి ఎంటర్ అవుదామని అనుకున్నాం. ఆరోజు రాజీవ్ కూడా ఉన్నాడు. ఇక బ్యాక్ డోర్ నుంచి ఈవెంట్ అయిపోయిన తరువాత వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో అటు నుంచి డోర్ వేసేసారు. మరోవైపు ఇటునుంచి జనాలు మా మీదకు వచ్చేస్తున్నారు. నేను 8 మంత్ ప్రెగ్నెన్సీ కాబట్టి ముందు చేతులు పెట్టుకొని హోల్డ్ చేస్తున్నాను.
నా స్టమక్ కూడా డోర్ కి చాలా దగ్గరగా ఉంది. తర్వాత వెనకనుంచి రాజీవ్ వచ్చి నన్ను కాపాడాడు. మరోవైపు నుంచి రాజీవ్ కూడా హెల్ప్ లెస్ గా ఉంటూ డోర్ తీయండి అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. సినిమాల్లో అయితే ఇది ఇంకా బాగా చూపించొచ్చు. వాళ్లు మమ్మల్ని టచ్ చేస్తున్నారు అనుకునే టైంలో డోర్ ఓపెన్ అయింది. ఆ వెంటనే ఊపిరి పీల్చుకొని బయటకు వెళ్లాను. నేను కడుపుతో ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది.
ఒక గవర్నమెంట్ ఈవెంట్ కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోస్ట్ చేశాను. ఆ ఈవెంట్ లాల్ బహుదూర్ స్టేడియంలో జరిగింది. కానీ కార్లన్నీ కొంచెం దూరంగా ఆపేశారు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
ఏడో నెలలో ఉన్నప్పుడు చాలా దూరం నడుచుకుంటూ హడావుడిగా స్టేజ్ ఎక్కి అలసిపోతూ మాట్లాడాను. అప్పటికే నా కోసం అక్కడ చాలామంది ఎదురుచూస్తున్నారు. అలానే ఆంధ్రావాలా సినిమా అప్పుడు కూడా జరిగిన ఇన్సిడెంట్ షేర్ చేశారు.
Also Read: Anchor Suma: ఇప్పుడు మన బతుకులు అవి, ఎన్టీఆర్ కోప్పడం పై సుమా రియాక్షన్