Malavika Mohanan: తక్కువ సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది మాళివిక మోహనన్. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంపైనే అవుతోంది.

తొలుత మలయాళం మూవీ ద్వారా అడుగుపెట్టిన కేరళ కుట్టి, ఆ తర్వాత కన్నడ, హిందీలో అడుగు వేసుకుంటూ వచ్చింది.

2019 నుంచి 2022 మధ్య కంటిన్యూగా కోలీవుడ్‌కే పరిమితమైంది.

ఈ క్రమంలో ‘ద రాజా సాబ్’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ప్రస్తుతం ఫ్యాన్ బేస్ పెంచుకునే ఆలోచనలో పడింది. ఈ క్రమంలో రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది.

ఓ జ్యువెలరీకి చెందిన యాడ్ చేసింది. ఒళ్లంతా బంగారంతో మెరిసిపోతోంది.

మాళవిక వల్ల బంగారానికి అందం వచ్చిందా? బంగారం వల్ల ఈ సుందరి బ్యూటీగా ఉందా?

అనేది తెలుసుకోలేక తికమకపడుతున్నారు హార్డ్ కోర్ అభిమానులు. ఇప్పుడు ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.