Allu Arjun – Pawan Kalyan: మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అనే వివాదం చాలాకాలంగా ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. ఏపీ ఎన్నికల ప్రచారం సమయం నుండి మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉంటున్నాడు. అలాగే ఆ ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘పుష్ప 2’ సినిమా అంత భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్నప్పుడు కూడా మెగా ఫ్యామిలీ అసలు దీనిపై స్పందించలేదు. సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా దీని గురించి మాట్లాడలేదు. కానీ తాజాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడంతో మెగా ఫ్యామిలీ.. ముఖ్యంగా చిరంజీవి, నాగబాబును ప్రత్యేకంగా వెళ్లి కలిసాడు. మరి పవన్ కళ్యాణ్ మాటేంటి.?
మనస్పర్థలు తొలగిపోయాయి
‘పుష్ఫ 2’ ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్‌లో రేవతి అనే మహిళ మృతిచెందిన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక రాత్రి జైలులో ఉన్న తర్వాత అల్లు అర్జున్‌కు బెయిల్ లభించింది. దీంతో జైలుకు వెళ్లొచ్చాడని చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు అల్లు అర్జున్‌ను కలవడానికి క్యూ కట్టారు. దాదాపు అందరు యంగ్ హీరోలు తన ఇంటికి వచ్చి బన్నీని కలిశారు. మెగా హీరోలు మాత్రం రాకపోవడంతో మరుసటి రోజు అల్లు అర్జునే వెళ్లి చిరంజీవి, నాగబాబును కలిశారు. దీంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు ఉన్న మనస్పర్థలు తొలగిపోయినట్టే అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాత్రం బన్నీని కలవడానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట.
Also Read: అల్లు స్నేహమ్మ… బన్నీకి ఆ భాద ఎలా ఉంటుందో మీరైనా చెప్పండమ్మా..
కలవడం ఇష్టం లేదా.?
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు. తన అరెస్టుతో ఆ పోస్ట్‌కు సంబంధం లేకపోయినా.. ప్రేక్షకులు మాత్రం ఇది ఇన్‌డైరెక్ట్ రెస్పాన్స్ లాగా అనిపిస్తుందని అనుకున్నారు. ఆరోజు వెంటనే హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్‌లో కూడా వచ్చారు పవన్ కళ్యాణ్. దీంతో అల్లు అర్జున్‌ను కలవడానికే వచ్చారని కూడా అనుకున్నారు. ఎప్పుడెప్పుడు ఇద్దరు కలుస్తారా అని ఎదురుచూశారు. కానీ హైదరాబాద్‌కు వచ్చిన పవన్ వెంటనే తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఆయన అల్లు అర్జున్‌ను కలవడానికి ఇష్టపడడం లేదని క్లారిటీ వచ్చేసింది. ఇక అల్లు అర్జునే స్వయంగా తనను కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
స్పందన లేదు
ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) పలుమార్లు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినా పవన్ టీమ్ స్పందించలేదట. అయితే డిప్యూటీ సీఎం అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడా, లేదా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల అయినా కలవడానికి ఇష్టపడడం లేదా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి, నాగబాబును కలిసి మెగా వర్సెస్ అల్లు వివాదానికి అల్లు అర్జున్ తెరదించాడని అనుకునేలోపే పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్‌గా మారింది.