Henna For White Hair: జుట్టు ఊడిపోవడం, తెల్ల జుట్టు రావడం, చుండ్రు సమస్యలు ఈ కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు కావచ్చు. హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, పొల్యూషన్, పోషకాహారం తినక పోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగించడం, తలకు నూనె పెట్టుకోకుండా ఉండటం,హెయిర్ డ్రైయర్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఒక్కసారి ఈ హెన్నాను ట్రై చేయండి. మీకు మంచి రిజల్ట్ కనిపిస్తాయి. మరి హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు..
గోరింటాకు పొడి
బిర్యానీ ఆకులు
చెక్క, లవంగాలు
కాఫీ పొడి
బొప్పాయి ఆకులు
కోడిగుడ్డు ఒకటి
ఒక కప్పు వాటర్
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి.. అందులో మూడు బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఐదు లవంగాలు, కాఫీ పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వాటర్‌ని పక్కన పెట్టుకోండి. మిక్సీజార్‌లో బొప్పాయి ఆకులను తీసుకుని ముక్కలుగా కట్ చేసి, దాన్ని మెత్తగా పేస్ట్ చేసి వడకట్టుకోండి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్‌లో గోరింటాకు పొడి తీసుకుని అందులో బొప్పాయి రసం, ముందుగా రెడీ చేసుకున్న కాఫీ, బిర్యానీ ఆకులతో తయారు చేసిన వాటర్‌ని కలిపి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి రాత్రంతా అలానే ఉంచండి. ఇది కొద్దిసేపటికి బ్లాక్ కలర్‌లో వస్తుంది.
ఆ తర్వాత ఉదయం ఈ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్లసొన వేసి.. బాగా కలిపి జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా 15 రోజులకు ఒకసారి జుట్టుకు అప్లై చేస్తే క్రమంగా తెల్లజుట్టు అనేది తగ్గిపోతుంది. దీంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.
Also Read: ఇలా చేస్తే.. చందమామ లాంటి ముఖం మీ సొంతం
తెల్లజుట్టును శాశ్వతంగా నివారించేందుకు మరొక చిట్కా..
ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు, టీ స్పూన్ పంచదార, అలాగే ఒకటిన్నర స్పూన్ టీపొడి వేసి 10 నిమిషాలపాటు మీడియం ఫ్లేమ్‌లో మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, ఒక బౌల్‌లో డికాషిన్‌ను వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పడు మిక్సీజార్‌లో గోరింటాకు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ పెరుగు, ముందుగా తయారు చేసుకున్న డికాషిన్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకావాలి. దీన్ని జుట్టు చివర్ల వరకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు అనేది శాశ్వతంగా తగ్గిపోతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలన్ని జుట్టు పెరుగుదలకు చక్కగా పనిచేస్తాయి. ఈ హెన్నా అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.