Mehreen: తక్కువ సినిమాలతో టాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ మెహ్రీన్.
తెలుగు ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ సుందరి, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
తొమ్మిదేళ్ల కెరీర్‌లో తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది కూడా.
ఫస్ట్ మూవీ కృష్ణగాడి వీర ప్రేమగాథతో బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టింది.
అదే సమయంలో టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉండడంతో డైరెక్టర్ల దృష్టి ఈమెపై పడింది.
ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది కూడా.
ఈ ఏడాది ఒక్క సినిమాలో ఆమె నటించలేదు.
ఇంతకీ మెహ్రీన్ ఉందా అనే డౌట్ హార్డ్ కోర్ అభిమానులను వెంటాడింది.
తనకున్న పరిచయాలతో కోలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టేసింది పంజాబీ బ్యూటీ.
వచ్చే ఏడాదైనా ఆమె ఇయర్ ఛార్ట్ ఫుల్ కావాలని ఆశిద్దాం.