Dadasaheb Phalke Biopic : సినీ పితామహుడిగా చిత్ర పరిశ్రమ దాదాసాహెబ్ ఫాల్కే ని కొనియాడుతూ ఉంటారు. అసలు మన చిత్ర పరిశ్రమ ఎక్కడ పుట్టింది. ఈ చిత్ర పరిశ్రమకు బీజం ఎలా పడిందనే విషయాలు తెలియాలి అంటే సినీ పితామహుడిగా పిలిచే దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) జీవిత కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది గొప్ప వారి బయోపిక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమాను కూడా చేస్తే నేటితరం వారికి సినిమా గురించి క్షుణ్ణంగా అర్థమవుతుందని భావించి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమాకు సిద్ధమయ్యారు.
ఈ గొప్ప ప్రాజెక్టు కోసం ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) రంగంలోకి దిగారని ఇదివరకు ఎన్నో వార్తలు వినిపించాయి అలాగే దాదాసాహెబ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) సరిగ్గా సరిపోతారని, ఎన్టీఆర్ మాత్రమే ఈ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరు అంటూ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అతి త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాలుస్తుందని భావించారు కానీ అభిమానులకు నిరాశ ఎదురయిందని చెప్పాలి.
ఈ బయోపిక్ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలపైకి వెళ్లేలా ఏమాత్రం కనిపించడం లేదు. ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకోవాలి అంటే మరి కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.. ప్రస్తుతానికి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. ఇలా ఈ సినిమా ముందుకు సాగక పోవడానికి కారణం ఎన్టీఆర్ అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ సినిమాలో నటించడానికి కాల్ షీట్స్ ఏ మాత్రం దొరకని నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఈ సినిమాని హోల్డ్ లో పెట్టాలనే ఆలోచనలో రాజమౌళి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఎన్టీఆర్..
మరి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఎన్టీఆర్ లేదా రాజమౌళి స్పందించాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే ఈయన దేవర 2 సినిమా పనులలో పాల్గొంటారు అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక ఈ సినిమా కార్తికేయ స్వామి కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ చివరిగా బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read: Srinidhi shetty: ఆ ఇద్దరి హీరోల కోసం రాత్రి పగలు ఆ పని చేస్తా.. శ్రీనిధి శెట్టి