BigTV English

Hydra Rules: ఇల్లు, స్థలాలు కొంటున్నారా? హైడ్రా రూల్స్ ఇవే.. ముందుగా ఏం చేయాలంటే?

Hydra Rules: ఇల్లు, స్థలాలు కొంటున్నారా? హైడ్రా రూల్స్ ఇవే.. ముందుగా ఏం చేయాలంటే?

Hydra: హైదరాబాద్ లో ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా? అయితే ముందుగా అది సక్రమమైన నిర్మాణమా? కాదా? తెలుసుకోవాలి. అక్రమ నిర్మాణం అయితే హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydraa).. నగరంలోని చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తుంది.


ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉందా? లేదా?

చెరువులు, కుంటలు, నాలాలు, వాగుల సమీపంలో ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటే ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉందేమో ముందుగా తనిఖీ చేసుకోవాలి. ముందుగా ఇలా చెక్ చేసుకుంటే భవిష్యత్తులో మీ ప్రాపర్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హైడ్రా అధికారులు చెబుతున్నారు. చెరువులు, కుంటలను హెచ్ఎండీఏ నోటిఫై చేసి ఆ వివరాలను హెచ్ఎండీఏ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది.

అయితే నోటిఫై చేయని చెరువులకు సంబంధించి మ్యాప్‌లను హెచ్ఎండీఏ అధికారుల వద్ద పొందవచ్చు. పూర్తి వివరాలతో హైడ్రా త్వరలో ప్రత్యేకంగా వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో అన్ని చెరువుల వివరాలు అందుబాటులో ఉంచుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. దీంతో పాటు హైడ్రా ప్రత్యేకంగా యాప్ తీసుకురానుంది.


త్వరలో హైడ్రా యాప్

హైడ్రా యాప్ లో ప్రజలు కొనుగోలు చేయాలనుకునే ప్రాపర్టీ ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లోకి వస్తుందా? లేదా? తెలుసుకోవచ్చని ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువులు, కుంటల సమీపంలో అపార్టుమెంట్లు, స్థలాలు కొనుగోలు చేసే సమయంలో బిల్డర్లు, వ్యాపారుల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని సూచించారు.

హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో

హెచ్ఎండీఏ పరిధిలో 2,857 చెరువులు ఉన్నాయి. వీటిలో 168 చెరువులు జీహెచ్ఎంసీ పరిధిలో, 2,689 చెరువులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి.
వీటిల్లో 2,569 చెరువులను హెచ్ఎండీఏ నోటిఫై చేసి వెబ్‌సైట్‌లో మ్యాప్ లను అందుబాటులో ఉంచింది. దీంట్లో చెరువులు లేదా కుంటల పరిధిలో ఇల్లు లేదు స్థలం ఉందా? లేదా? అనేది హెచ్ఎండీఏ వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

హెచ్ఎండీఏ వెబ్ సైట్ లో జిల్లా, మండలం, గ్రామం, చెరువు పేరు, చెరువు ఐడీ, నోటిఫై చేసిన తేదీలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌ వివరాలు సర్వే నంబర్లతో సహా ఉంటాయి. ఎఫ్టీఎల్ మ్యాప్‌లపై క్లిక్ చేస్తే చెరువులకు సంబంధించిన సరిహద్దులను తెలుసుకోవచ్చు. ఈ వివరాలు ఆధారంగా ప్రాపర్టీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లోకి వస్తుందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ శాఖలో వివరాలు

అలాగే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ వెబ్‌సైట్‌లో నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు ఇలా పలు కారణాలతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ వెబ్ సైట్ లో కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత భూముల జాబితాలో లేకపోయినా బిల్డింగ్ రూల్స్, 2012 ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో భవనాల నిర్మాణం నిషేధం.

Also Read: Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు

రెరాలో నమోదు

2016 రెరా చట్టం ప్రకారం డెవలపర్స్ కచ్చితంగా తమ ప్రాజెక్టులను రెరాలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇల్లు లేదా అపార్టెమెంట్లు కొంటున్నట్లయితే రెరా వెబ్‌సైట్లో చెక్ చేసుకోవడం మంచిది. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు పాటించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచిస్తు్న్నారు.

Related News

BC Reservations: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Cockroach In Food: నానక్ రామ్ గూడ కృతుంగ హోటల్ లో షాకింగ్ ఘటన.. రాగి ముద్దలో బొద్దింక

Fire Accident: హైదరాబాద్‌లో పెట్రోల్ పంపులో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదేనా..?

Fire Accident: పెట్రోల్‌ బంక్‌ వద్ద కారులో చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు

Hydra: శభాష్ హైడ్రా.. కూల్చివేతలపై అభినందించిన హైకోర్టు

CM Revanth Reddy: బెంగళూరుకు సీఎం రేవంత్.. అసలు విషం ఇదే

Telangana: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేసీఆర్ ప్లాన్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ?

Big Stories

×