ప్రపంచంలోనే అత్యుత్తమ రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పటికే అక్కడ బుల్లెట్ రైళ్లతో పాటు అత్యాధునిక లగ్జరీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో సరికొత్త రైలును అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కొత్త మాగ్లెవ్ రైలు కేవలం 40 నిమిషాల్లో టోక్యో- నగోయాను కనెక్ట చేయనుంది. ఈ రైల్లో ప్రయాణించే వారికి అదనపు సౌకర్యం కోసం చక్కటి గదులు, అద్భుతమైన క్యాబిన్ కాన్ఫిగరేషన్ ను కలిగి ఉంటుంది. ఈ రైలు అత్యాధునిక మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ప్రయాణించనుంది. ఈ రైలుకు సంబంధించిన వివరాలను తాజాగా రైల్వే ట్రాన్స్ పోర్ట్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది.
సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ఈ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. అద్భుతమైన 15-డిగ్రీల కోణంలో ఉండే నాన్ రిక్లైనింగ్ సీట్లను ఈ రైళ్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణీకులు ఎంతో సౌకర్యవంతంగా, అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ రైలును రూపొందించారు. చిన్న రైడ్ కోసం వెళ్లే ప్రయాణీకులకు కూడా మంచి లెగ్ స్పేస్, లగేజ్ స్థలాన్ని అందిస్తుంది. ఈ రైల్లో తేలికైన సీట్ల కారణంగా నిర్వహణ ఖర్చుకూడా భారీగా తగ్గుతుందని అధికారులు వెల్లడించారు. శుభ్రపరచడం కూడా ఈజీగా ఉంటుందన్నారు.
జపాన్ లో M10 ప్రోటోటైప్ ఇప్పటికే ఈ మోడల్ లో రూపొందించబడింది. గత జూలైలో లో M10 ప్రోటోటైప్ క్యాబిన్ ను ఆవిష్కరించారు. విస్తృతమైన ఓపెన్ నెస్, సున్నితమైన ఎర్గోనామిక్ శైలితో ఆకట్టుకుంది. ఫైనల్ ధృవీకరణ, సెట్టింగ్ తర్వాత దాని కమర్షియల్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. సౌకర్యం, హైస్పీడ్ పనితీరును ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి.
సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించే మాగ్లెవ్ రైలు గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ వీల్ ట్రాక్ ఘర్షణను తొలగిస్తుంది. శబ్దం అనేది అస్సలు ఉండదు. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లీనర్ రైడ్ ను అందిస్తుంది. డిజైనర్లు ఈ రైలు బాడీ వెయిన్ ను సమానంగా పంపిణీ చేయబడే విధంగా కుషోన్డ్ సీట్లను యాడ్ చేశారు. ప్రయాణీకులకు ఎలాంటి అలసట అనేది ఉండదు. సాంప్రదాయ హైస్పీడ్ రైళ్లతో పోలిస్తే ఈ రైలు తక్కువ విద్యుత్ ను తీసుకుంటూ ఎక్కువ సామర్ధ్యంతో నడుస్తుంది. ఈ రైళ్ల కారణంగా పొల్యూషన్ అనేది ఉండదు.
Read Also: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!
సరికొత్త మాగ్లెవ్ రైలు అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ రైలును 2027లోగా అందుబాటులోకి తీసుకురావాలని జపాన్ రైల్వే భావించింది. అయితే, ఈ మార్గంలో ఉన్న భవన నిర్మాణాల తొలగింపు వివాదం కారణంగా ఆలస్యం అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. 2034లోగా టోక్యో-నాగోయా విభాగాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ రైల్వే లైన్ ఒసాకా వరకు విస్తరించి.. ప్రపంచంలోని అత్యంత అధునాతన ఇంటర్‌సిటీ రవాణా నెట్‌వర్క్ లలో ఒకటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు జపాన్ రైల్వే అధికారులు.
Read Also: రైల్లో హైటెక్ వాష్ రూమ్, ఫైవ్ స్టార్ హోటల్లోనూ ఇలా ఉండదండీ బాబూ!